నాగబాబుపై అన్నయ్య గుస్సా…రీజ‌నేంటంటే..

Views: 253

ఖైదీ నం.150 చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ సాఫీగా సాగిపోతుంటే నాగబాబు నాన్ వెజ్ యాడ్ అభిమానులను ఖంగుతినిపించారు. నాగబాబు ఊగిపోతే ప్రముఖ రచయిత యండమూరి వీరేంధ్రనాథ్, దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై గద్గద స్వరంతో తిట్టిపోశారు.ఆ రోజు ఆ వేదికపై చిరంజీవి గొప్పతనాన్ని, చిత్ర విశేషాల్ని మిగతవారు మాట్లాడితే నాగబాబు మాత్రం..వాళ్లందరికి బాబులా…ఇద్దరికి (యండమూరి, వర్మ)మొగుడిలా బ్రహ్మండం బద్దలుకొట్టారు.

తొమ్మిదేళ్ల తర్వాత చిరంజీవి సినిమాను హిట్ చేయాలని మెగా ఫ్యామిలీ, అభిమానులు కాలికి బలపాలు కట్టుకొని… ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను విజయవంతం చేయాలని నెలల తరబడి కష్టపడితే ఆ కష్టాన్ని నాగబాబు బూడిదలో పోసిన పన్నీరు చేశాడని ఆ వేదికపైనే చాలామంది అతిథిలు, అభిమానులు, మెగా ఫ్యామిలీ మెంబర్లు పెదవి విరచారట.
అందరితో కలుపుగోలుగా మాట్లాడిన చిరంజీవి..చాలా ఏళ్ల తర్వాత వెండితెర మీద తన విశ్వరూపం ప్రదర్శించనున్న ఆయనకూడా వేదికపై డైలాగులు పంచి అభిమానులకు సందడి చేశారు.

అయితే ఆ ఫంక్షన్ ముగియగానే..అంత వరకు ఓపిక పట్టిన చిరు..తమ్ముడు నాగబాబుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రెస్టీజ్ గా తీసుకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తే…తమ్ముడు దాన్ని నీరుగార్చాడని…సన్నిహితులైన నిర్వాహకులతో సీరియస్ అయినట్లు తెలిసింది. వాళ్లను (వర్మ, యండమూరి) తిట్టడానికి ఇదా వేదిక? అంటూ వ్యాఖ్యానించారట. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేంత వరకు తమ్ముడు నాగబాబుతో మాట్లాడకుండా ఉండిపోయారని టాక్. కాకపోతే అదేపనిగా వర్మ ట్వీట్ల వార్ కొనసాగిస్తుండటం…ఇది వరకే యండమూరి తన తనయుడి గురించి ఓ వ్యక్తిత్వ వికాస క్లాసులో వ్యాల్యూ తగ్గించి మాట్లాడి ఉండటంతో…స్వీట్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.

‘నాగబాబు మళ్లీ అలా మాట్లాడబోడనే అనుకుంటున్నా…కానీ ఈ వివాదాన్ని ఇలాగే కొనసాగిస్తుంటే..అటు నుంచి మళ్లీమళ్లీ రిప్లయ్స్ వస్తుంటే మాత్రం..నేను మాత్రం ఏం చేయగలను?’ అని మెగాస్టార్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *