అస‌లు ఇది రివ్యూ రాయాల్సిన సినిమానేనా…?

Views: 11458

ఔను, నిజంగా నిజమైన ఒక డౌట్. ఖైదీ నెంబ‌ర్ 150 మూవీకి రివ్యూ రాయాల్సిన అవ‌స‌రం ఉందా..? తొమ్మిదేళ్ల త‌ర్వాత చిరు వెండితెర‌పై క‌నిపించేందుకు సిద్ధ‌మైన మూవీ, సంక్రాంతి బ‌రిలో ఫ్యాన్స్ ముందుకు వ‌చ్చిన మూవీ, అందునా క‌త్తి లాంటి ఏ మాత్రం సుత్తి లేని మూవీ తెలుగులో వ‌స్తుంటే రివ్యూ రాయాలా…? మూవీ అలా ఉంది. అక్క‌డ ఆ లోపాలున్నాయి..ఇక్క‌డ ఇలా ఉంటే బాగుంటుంద‌ని చెప్పుతూ ఓ రివ్వూ రాయాల్సిన‌వ‌స‌రం అస‌లేమాత్రం ఉంది.

క‌త్తి సూప‌ర్ క‌థ‌

త‌మిళ్‌లో క‌త్తి సినిమా చూసిన‌వాళ్లంద‌రికి అద్భుత‌మైన క‌థ అని తెలుసు. చిరంజీవి అండ్ కో మొద‌టి నుండి ఇదే మాట చెప్పింది. దీంతో, ఈ క‌థ గురించి మాట్లాడాల్సిన‌వ‌స‌రం లేదు. స‌మ‌స్య‌ల్లా, విజ‌య్ లాంటి యంగ్ హీరో చేసిన మూవీ, చిరుకి సూట్ అవుతుందా లేదా అనేదే అస‌లైన డౌట్‌గా కొంద‌రిలో ఉండే. టీజ‌ర్‌, ట్రైల‌ర్ చూశాకా ఆ డౌట్ క్లారిఫై అయ్యింది. అలాంట‌ప్పుడు క‌థ ప‌రంగా మూవీకి రివ్యూ అవ‌స‌రం లేద‌నేది న్యూస్ఈజ్‌పీపుల్‌.కామ్ బ‌ల‌మైన వాద‌న‌

కాపీ పేస్ట్ చేశారు

త‌మిళ్‌లో ఎలా ఉందో, తెలుగులో అలాగే తీశారు. మ‌క్కీ టు మ‌క్కీ అనే స్ట‌యిల్‌లో సినిమాను తెర‌కెక్కించారు. అలాంట‌ప్పుడు సినిమా టేకింగ్ బాగాలేదు అని ఎలా రాస్తారు. రాయ‌లేరు. అదే టైమ్‌లో అక్క‌డ మురుగుదాస్ తెర‌కెక్కించిన మూవీని ఇక్క‌డ వివి వినాయ‌క్ యాస్ ఇట్ ఈజ్‌గా తీసేశాడు. సో అలాంట‌ప్పుడు సినిమా బాగా తెర‌కెక్క‌లేదు అని చెప్ప‌డానికి అవ‌కాశం ఎక్క‌డిది లేనే లేదు. సో ఇలాంట‌ప్పుడు రివ్యూ రాయాల్సిన‌వ‌స‌రం ఏం ఉంటుంది.

చిరునే హైలైట్‌

తొమ్మిదేళ్ల త‌ర్వాత వెండితెర‌పైన సంద‌డి చేసేందుకు వ‌స్తున్న చిరంజీవి, ప‌క్కా ప్లానింగ్‌తో వ‌చ్చాడు. లుక్ మొద‌లు, బాడీ వెయిట్ త‌గ్గ‌డం వ‌ర‌కు అంతా సిద్ధ‌మ‌య్యాకే షూటింగ్ స్పాట్‌కి వ‌చ్చాడు. రిలాక్స్‌గా 84రోజుల టైమ్ తీసుకోని ప్ర‌తి ఫ్రేమ్‌ను చెక్‌చేసుకోని మూవీని తీశారు. అలాంట‌ప్పుడు త‌ప్పులు జరిగే అవ‌కాశం ఉండ‌దు.

పాట‌లు కాపీ అయినా, ట్యూనింగ్ సూపర్బ్‌

దేవీశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన పాట‌లు గ‌తంలో ఎక్క‌డో విన్న‌ట్టుగానే ఉన్నా…చాలా కాలంగా బాస్ డ్యాన్స్ మిస్ అయిన ఫ్యాన్స్‌కి అవేవి ప‌ట్టించుకోకుండా, వేసిన స్టెప్పుల‌ను చూసి ఫిదా అయిపోయారు. ఒక్కొ పాట‌లో ఒక్కొ స్ట‌యిల్లో చిరు చిందేస్తుంటే, థియేట‌రంతా ఊగిపోవ‌డ‌మే కాదు…అభిమానులంతా పూన‌కం వ‌చ్చిన‌వాడిలా వూగిపోయారు. సాంగ్ వీడియో ముక్క చూసిన‌ప్పుడు ఈ సీన్ అర్థ‌మైపోయింది.

రామ్‌చ‌ర‌ణ్ మ‌రో హైలైట్‌

ముందు నుండి ఈ మూవీలో ఎవ‌రు మెగా హీరోలు లేర‌ని, కేవ‌లం, రామ్‌చ‌ర‌ణ్ మాత్ర‌మే ఉన్నాడ‌ని చిత్ర‌యూనిట్ చెప్పింది. చెప్పిన‌ట్టుగానే అత‌ను అమ్మ‌డు, కుమ్ముడు సాంగ్‌లో క‌నిపించి ఎంట‌ర్‌టైన్ చేశాడు. చిరుతో క‌లిసి ఫ్రేమ్‌ను పంచుకోని వాహ్ అనిపించాడు. ఇవ‌న్నీ చూసిన‌ప్పుడు ఖచ్చితంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌రికొత్త రికార్డ్‌లు, క‌లెక్ష‌న్స్‌ను కురిపించిన సినిమానే ఇది అని ఇట్టే అర్థ‌మ‌వుతుంది. అంతేకాదు, రివ్యూ రాసినోళ్లు కూడా సూప‌ర్ అని పొగిడేస్తుండం కూడా క‌లిసి వ‌చ్చే విష‌యం. ఆ మాట కొస్తే బాస్ సినిమాకు రిపీటెడ్ ఆడియెన్స్ గ్యారెంటీ. దీంతో…ఎంత క‌లెక్ష‌న్లు వ‌సూలు చేస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *