ఖైదీ వెన‌క ఇంత రాజకీయం ఉందా..?

Views: 5259

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడంతా ఖైదీనెంబ‌ర్ 150, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమాల‌ ఫీవ‌రే న‌డుస్తోంది. ఒక‌వైపు బాల‌య్య‌, మరోవైపు చిరంజీవి…ఎక్క‌డ చూసినా వీళ్ల గురించే హాట్ హాట్ చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఈ చ‌ర్చ‌ల‌కు మ‌రింత పొలిటిక‌ల్ ఫ్లేవ‌ర్ ను జోడించాడు చిరంజీవి. తన సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూనే, ప్ర‌స్తుతం పాలిటిక్స్ ఎలా ఉన్నాయో త‌న‌దైన స్టైల్లో చెప్పాడు.

చిరంజీవి కాంగ్రెస్ లో ఉన్నాడంటే ఉన్నాడ‌న్న‌ట్టుగా ఉన్నాడు..సినిమాల్లో దొరికినంత క్రేజ్ పొలిటిక‌ల్ గా బాస్ కు దొర‌క‌డంలేదు. అందుకే రాజ‌కీయాల‌పై కాస్త విసుగ్గానే మాట్లాడాడు. ప్ర‌స్తుతం రాజ‌కీయాలు స్త‌బ్ధుగా ఉన్నాయ‌ని, అందుకే వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని డిసైడైనట్టు తెలిపాడు. ఈ ఏడాది మ‌రో రెండు సినిమాలు చేస్తున్నాన‌ని అభిమానుల‌కు హాట్ న్యూస్ చెప్పాడు. ఈ యేడాది నా నుంచి మరొక సినిమా విడుదలయ్యేందుకు ప్రయత్నిస్తా. నా 152 వ సినిమాకు కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయిఅని తెలిపాడు..

తన 151 వ సినిమా. లాంగ్ పెండింగ్ అయిన ‘ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి’ కథతో గానీ, సురేందర్ రెడ్డి అందించే మరో కథతో గానీ సినిమా చేస్తానని చెప్పిన చిరంజీవి…ఆ చిత్రానికి కూడా తనయుడు రామ్ చరణే నిర్మాతని తెలిపారు. 152వ చిత్రానికి మాత్రం గీతా ఆర్ట్స్ లో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తానని వెల్లడించారు.

త‌న త‌మ్ముడు నాగబాబు… యండమూరి, వర్మలపై చేసిన కామెంట్లు..సోషల్ మీడియా పోస్టింగ్ లపై కూడా చిరంజీవి స్పందించారు. తమ కుటుంబ సభ్యులెవరూ వేరొకర్ని బాధపెట్టేవాళ్లు కాదని, ఏ విషయాన్నైనా సానుకూలంగా తీసుకుంటామని అన్నారు. ఒకర్ని బాధపెట్టడం ఎంతవరకు సబబు అని ఎదుటి వ్యక్తులు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. వర్మతో తనకు అస్సలు గొడవలు లేవని స్పష్టం చేసిన చిరంజీవి…నాగబాబు ఓ విషయంలో బాధపడ్డాడని తన కోణంలో అలా స్పందించడం తప్పేం కాదని అభిప్రాపడ్డారు.

సోషల్ మీడియాలో స్పందించే వారు స్వయంనియంత్రణ పాటించాలని, అభిమానులు ఎవరూ హద్దులు దాటకూడదని సూచించారు. మిగతా నటుల సినిమాలు విజయవంతంగా ఆడాలని చిరు ఆకాంక్షించారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *