విరాట్, అనుష్క ఎంగేజ్‌మెంట్‌, డ్రెహాడూన్‌కి అమితాబ్‌, అంబానీ

Views: 847

అభిమానులు ఎంతో ఇష్టంగా డిబేట్ పెట్టుకునే అనుష్క శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ ల‌వ్‌స్టోరీ మ‌రింత దృఢంగా మారేందుకు సిద్ధ‌మ‌వుతుందా..? ఈ జంట కాసేప‌ట్లో ఎంగేజ్‌మెంట్‌తో ఒక్క‌టి కానున్నారు. యువ‌రాజ్‌, హెజ‌ల్ కిచ్‌లాగా, ప‌రాయి దేశంలో ఉంగ‌రాలు మార్చుకునేందుకు సిద్ధ‌మ‌య్యారా..?
తీరు చూస్తుంటే అలాగే క‌నిపిస్తోంది. వీరిద్ద‌రూ కాసేప‌ట్లో లేదా రేపు రింగేజ్‌మెంట్ చేసుకోనున్న‌ట్టు తెలుస్తోంది. జాతీయ మీడియాలో ఈ విష‌యంపై జ‌రుగుతున్న డిబేట్‌తో పాటు, బాలీవుడ్ స్టార్స్ ఇస్తున్న అప్‌డేట్స్ ప్ర‌కారం ఈ హాట్ పెయిర్ నిశిత్చార్థం చేసుకోనున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

దాదాపు మూడేళ్లుగా పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న వీరిద్ద‌రూ, రెండు రోజుల క్రితం హాలీడే ట్రిప్ కోసం డెహ్రాడూన్ వెళ్లారు. అయితే, అంద‌రూ ఈ టూర్ కొత్త ఏడాదికి వెల్‌క‌మ్ చెప్పేందుకు అనుకున్నారు. కానీ, అక్క‌డి నుండి వాళ్లిద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్ట‌ర్‌లో చేసిన పోస్ట్‌లు అభిమానుల్లో ఆస‌క్తిని రేపుతున్నాయి. అదే టైమ్‌లో ఇద్ద‌రి మెడ‌లో రుద్రాక్ష‌మాల‌లు ఉండ‌టం కూడా వీరిద్ద‌రూ ఒక్క‌టి కానున్నార‌నే వార్త‌ల‌కు ద‌గ్గ‌రి చేసింది. అదే టైమ్‌లో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ఫ్యామిలీతో పాటు ముఖేష్ అంబానీ డెహ్రాడూన్‌కి వెళ్ల‌డం హాట్ టాపిక్‌గా మారింది.

అమితాబ్‌తో పాటు మరికొంత‌మంది బాలీవుడ్ తార‌లు కూడా డెహ్రాడూన్‌కి క్యూక‌ట్టారు. దీంతో..ఈ రోజు లేదా రేపు విరాట్‌, అనుష్క ఎంగేజ్‌మెంట్ చేసుకోని అక్క‌డే న్యూయ‌ర్ బ్లాస్ట్‌లో సెల‌బ్రేష‌న్స్ చేసుకుంటార‌నే పుకార్లు బ‌లంగా వినిపిస్తున్నాయి. పుజారితో దిగిన ఫోటో కూడా ఆ సంకేతాలు ఇస్తుంది. 2015లో యువీ, హెజ‌ల్ కిచ్ ఇలా ఎలాంటి చ‌డీ చ‌ప్పుడు లేకుండా ఒక్క‌ట‌య్యారు. ఆ టైమ్‌లో రింగేజ్‌మెంట్ కార్య‌క్ర‌మం దీపావ‌ళి ముందు రోజు జ‌రిగింది. మ‌రీ..మ‌రో 24గంట‌ల్లో కోహ్లీ, అనుష్క ఎలాంటి ట్విస్ట్ ఇస్తార‌నేది ఆస‌క్తిగా మారింది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *