షుగర్ బ్యాగ్ అంత బరువైనా లేదు కానీ..

Views: 248

ఈ ఫొటోలో ఉన్న పాప పేరు డార్సీ గ్రేస్. డెలివరీ డేట్ కంటే 12వారాల ముందు పుట్టింది. దీంతో 600గ్రాముల కంటే బరువుతో ఉన్న ఈ పాపను కాపాడునేందుకు తల్లిదండ్రులు, వైద్యులు ఎంతో శ్రమించారు. బ్రిటన్ కు చెందిన గిల్ మార్క్ దంపతులకు మూడో సంతానంగా జన్మించిన పాప ఆరోగ్యం కోసం అనుక్షణం నిరీక్షించారు.

షుగర్ బ్యాగ్ అంత బరువు కూడా లేదని అంతా అన్నారు. ఎక్కువ రోజులు బతకదని చాలా మంది పెదవి విరిచారు. మూడు నెలల పాటు ఐసీయూలో పలు చికిత్సల అనంతరం నెమ్మదిగా బరువు పెరగడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంది. పాప ఆసుపత్రిలో ఉన్నప్పుడే క్రిస్మస్ పండగ వచ్చింది. పాప ఐసీయూలో ఉండటంతో మిగతా ఇద్దరు చిన్నారులో క్రిస్మస్ కూడా జరుపుకోలేకపోయారు.

మూడు నెలల ట్రీట్ మెంట్ తర్వాత పాప హెల్తీగా ఉందని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆ తల్లిదండ్రు ఆనందానికి అవధుల్లేవ్. బుధవారం (జనవరి 5) నాడు తమ చుట్టాలను ఇంటికి పిలిచి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అసలే బతకదనుకున్న పాప రోజురోజుకు బరువు పెరుగుతుండటంతో ఎంతో హ్యాపీ ఉన్న దండ్రులు…బంధువులు బహుమతులే బహుమతులు ప్రజెంట్ చేస్తున్నారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *