స‌మ‌యం లేదు మిత్ర‌మా…వ‌చ్చేస్తున్నా

Views: 330

బాల‌కృష్ణ వందో చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి మ‌రికొద్ది గంట‌ల్లో అభిమానుల ముందుకు రానుంది. ఫ్యాన్స్ ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న ఈ మూవీ బాక్సాఫీసు ద‌గ్గ‌ర సంద‌డి చేసేందుకు సిద్ధ‌మైంది. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తోనే అంద‌రిలో అటెన్ష‌న్ క్రియేట్ చేసింది. స‌మ‌యం లేదు మిత్ర‌మా..ర‌ణ‌మా, శ‌ర‌ణ‌మా అంటూ బాల‌కృష్ణ చెప్పిన డైలాగ్‌, బాల‌య్య అభిమానుల్లో ఫుల్ జోష్‌ని నింపింది. అంతేకాదు, మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డేలా చేసింది.

అలాంటి మూవీ రేపు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే భారీ ఓపెనింగ్స్‌పై క‌న్నేసిన శాత‌క‌ర్ణి, తొలి షో నుండే బాక్సాఫీసును షేక్ చేయాల‌ని చూస్తోంది. అంచ‌నాలు మాత్ర‌మే కాదు, మూవీ చూసిన వారు సైతం అలాంటి కాన్ఫిడెంట్‌నే వ్య‌క్త‌ప‌రుస్తున్నారు. దీంతో..మూవీ ఎలాంటి సంచ‌నాలు సృష్టిస్తుంద‌నేది ఇంట్రెస్ట్‌ను పెంచుతోంది. అంతేకాదు..బాల‌య్య‌ను క్రిష్ తెర‌పైన చూపించిన విధానం, శాత‌క‌ర్ణి నేప‌ధ్యం అంద‌రిలో ఆస‌క్తిగా మారింది.

ఈ మూవీ నిడివి రెండు గంట‌ల 12నిమిషాలు. చిత్రాన్ని చారిత్రాత్మ‌క నేప‌ధ్యంలో తెర‌కెక్కించిన ఎక్క‌డా క‌మ‌ర్షియ‌ల్ హంగులు మిస్ అవ్వ‌కుండా తెర‌కెక్కించారు. హేమామాలిని క్యారెక్ట‌ర్ మూవీకి ప్ల‌స్ పాయింట్‌. అలాగే, బాల‌య్య ప‌లికే డైలాగ్‌లు, శ్రియ యాక్టింగ్ మూవీని ఓ రేంజ్‌లోకి తీసుకెళ్తాయ‌ని అంద‌రూ ధీమాగా ఉన్నారు. బుర్రా సాయి మాధ‌వ్ డైలాగ్‌లు, కెమోరామెన్ మూవీని మ‌రోస్థాయికి తీసుకెళ్లార‌ని చిత్ర‌యూనిట్ ధీమాగా ఉంది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *