మీ అన్న‌య్య‌ను చూసి నిన్ను వ‌దిలేస్తున్నా..వ‌ర్మ ర‌చ్చ‌రచ్చ ట్వీట్స్‌

Views: 2947

లాస్ట్ పంచ్ మ‌న‌దైతే ఆ కిక్కే వేర‌ప్పా. ప‌వ‌న్ కళ్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ అంద‌రికి బాగా న‌చ్చింది.ఆ మాట‌కొస్తే చాలా సార్లు ఈ డైలాగే చెప్పి, ఓ రేంజ్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లా ఫీల‌వుతూ ఉంటారు. అలాంటి సీనే మెగా ఫ్యామిలీ మెంబ‌ర్‌కి జ‌రిగింది. ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో నాగ‌బాబు చేసిన కామెంట్స్ హాట్ హాట్‌గా మారిన వేళ‌, అతనికి, వ‌చ్చిన రివ‌ర్స్ ఎటాక్ టాక్ ఇప్పుడు అంత‌కుమించి అన్న‌ట్టుగా మారింది. అంతేకాదు, మ‌రీ
ఇంత దారుణంగానా అని డిబేట్ పెట్టుకునేలా చేసింది.

నాగ‌బాబు మాట్లాడిన కొద్దిసేప‌టికే, రామ్‌గోపాల్ వ‌ర్మ క్ష‌మాప‌ణ‌లు కోరుతూ ట్వీట్ చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. దానికి త‌గ్గట్టుగా ఆయ‌న పేజీలో పోస్ట్ అయిన ట్వీట్స్ కూడా కనిపించాయి. అయితే, కాసేప‌టికే, ఆర్‌జీవీ, ఎవ‌డో ఇడియ‌ట్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందంటూ ట్వీట్ చేశాడు. అంత‌టితో ఆగ‌ని వ‌ర్మ‌, నాగ‌బాబు సార్ అంటూ మ‌ర్యాదగా పిలుస్తూనే, అన్న‌య్య పేరు చెప్పుకుంటూ ఇండ్ర‌స్టీకి వ‌చ్చి, నాకు స‌ల‌హాలిస్తున్నావా అని గ‌ట్టిగానే బ‌దులిచ్చాడు వ‌ర్మ‌.

అంత‌టితో ఆగ‌కుండా…..నాగ‌బాబు వ‌ల్ల చిరంజీవి ఫంక్ష‌న్‌కి అంత‌రాయం క‌ల్గింద‌ని, దానికి తాను సారీ చెబుతున్నాన్నాడు. అంతేకాదు, చిరంజీవిగారు మీ మీద మ‌ర్యాద‌తో నాగ‌బాబుపై ట్వీట్ చేయ‌డం ఆపేస్తున్నా, చెప్పండి అత‌నికి అంటూ పోస్ట్ చేశాడు. ప్ర‌జారాజ్యం పార్టీ పేరు చెప్పి చిరంజీవిని త‌ప్పుదారి ప‌ట్టించింది నాగ‌బాబేన‌ని మండిప‌డ్డాడు. ఇంకోసారి, ఇలాంటి అక్కుప‌క్షి డైలాగులు చెబితే సీన్‌మ‌రోలా ఉంటుంద‌న్నాడు. ఈ కామెంట్స్ ఎటువైపు దారితీస్తాయో తెలియ‌దు కానీ, మీడియాకు మాత్రం ఫుల్ రేటింగ్స్ గ్యారెంటీగా క‌నిపిస్తుంది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *