ఆ యాంక‌ర్ ..శ్రీదేవి కన్నా అందంగా ఉంద‌ట‌

Views: 681

వంగ‌వీటి సినిమాకు హైప్ తీసుకురావ‌డంలో రామ్ గోపాల్ వ‌ర్మ సూప‌ర్ స‌క్సెస్ అవుతున్నాడు. వ‌ర్మ‌ను ఉక్కిరిబిక్కిరి చేద్దామ‌ని, అత‌ణ్ని ఇంట‌ర్వ్యూ చేసి టీర్పీ రేటింగ్ పెంచుకుందామ‌ని తెలుగు టీవీ చాన‌ల్స్ ఆరాట‌ప‌డుతున్నాయి. ఐతే టీవీ చాన‌ల్స్ ను ఎలా వాడుకోవాలో వ‌ర్మ‌కు బాగా తెలుసు. లైవ్ లోనే యాంక‌ర్ల‌ను లాజిక్ తో కొడ‌తాడు. ఆ చిట్ చాట్ చూస్తే…యాంక‌ర్ నే వ‌ర్మ ఇంట‌ర్వ్యూ చేస్తున్న‌ట్టు అనిపిస్తుంది. వంగ‌వీటి సినిమా విడుద‌ల‌కు ముందు ప‌లు టీవీ చాన‌ల్స్ లో చ‌క్క‌ర్లు కొట్టిన వ‌ర్మ‌…రిలీజైన త‌ర్వాత కూడా ఇంట‌ర్వ్యూల ప‌ర్వం కొన‌సాగిస్తున్నాడు.

కొన్ని గంట‌ల క్రితం ఓ చాన‌ల్ లో వ‌ర్మ ఇంట‌ర్వ్యూ టెలికాస్ట్ అయింది. వంగ‌వీటిపై వ‌ర్మ‌కు వంద‌ ప్ర‌శ్న‌లేసింది ఆ చాన‌ల్.. ఐతే వ‌ర్మ ఆ ఇంట‌ర్వ్యూనూ కూడా త‌న ప‌బ్లిసిటీకి మ‌రోసారి వాడుకున్నాడు. ఆ ఇంట‌ర్వ్యూను ట్విట్ట‌ర్ లో ప్ర‌స్తావిస్తూ…శ్రీదేవి కంటే అంద‌మైన యాంక‌ర్ తో టెలికాస్ట్ అయిన నా ఇంట‌ర్వ్యూను చూడండి అంటూ పోస్ట్ చేశాడు. నిన్న‌టి వ‌ర‌కూ శ్రీదేవి ఫ్యాన్ ను…ఆమె క‌న్నా అందంగా ఎవ‌రూ క‌నిపించ‌లేద‌ని చెప్పిన వ‌ర్మ‌…ఇప్పుడు ఈ యాంక‌ర్ ను పొగ‌డ‌టం వెన‌క లాజికేంటా అని నెటిజ‌న్లు త‌ల‌లు బాదుకుంటున్నారు.

నిజానికి వ‌ర్మ‌ను ఇంట‌ర్వ్యూ చేయాలంటే యాంక‌ర్లు విష‌యంతో పాటు, స్పాంటేనియ‌స్ తో వ్య‌వ‌హ‌రించాలి. ద‌మ్మున్న యాంక‌ర్ల‌ను సైతం వ‌ర్మ లాజిక్ తో ఆడుకున్న తీరు ప్రేక్ష‌కులు అంత‌కు ముందే ఓ చాన‌ల్ లైవ్ లో చూశారు. ఇక మ‌రో చాన‌ల్ లో ఆ యాంక‌ర్ ప్ర‌శ్న‌ల‌కు ఫిదా అయిన‌ట్టున్నాడు వ‌ర్మ‌. అందుకే ఆ యాంక‌ర్ ను శ్రీదేవి క‌న్నా అంద‌మైన‌దంటూ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నాడు. ఇంత‌కీ ఈ విష‌యం ఆ యాంక‌ర్ కు తెలిసిందా..? ఆ యాంక‌ర్ ఎవ‌రో మీకూ తెలిసిపోయింది కదా..? (ఫిమేల్ యాంక‌ర్ కాదు…మేల్ యాంక‌ర్ ) ఏంటో వ‌ర్మ‌…మ‌న ఖ‌ర్మ‌

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *