61యేళ్ల వ‌య‌సులో టీఆరెస్ ఎమ్మెల్సీ ల‌వ్ మ్యారేజ్‌

Views: 497

లేట్ వ‌య‌సులో ఘాటు ప్రేమ గురించి మ‌నం చ‌దివాం, విన్నాం. క‌ళ్లారా చూశాం. అయితే, అవి ఆ టైమ్‌లో కాస్త థ్రిల్‌కి గురిచేసినా…ఆ త‌ర్వాత ప్రేమ గుడ్డిదిలే అనుకుంటూ మ‌న‌కి మ‌న‌మే స‌ర్థిచెప్పుకున్నాం. ఇప్పుడు ఇలాంటి సీనే మ‌రోసారి హాట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ‌లో తిరుగులేని ఆధిక్యంతో దూసుకెళ్తున్న టీఆరెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ లీడ‌ర్ 61యేళ్ల వ‌య‌సులో ప్రేమ వివాహం చేసుకోవ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆ జంట‌కు విషెస్ చెబుతూ స‌ద‌రు లీడ‌ర్‌పై అభిమానాన్ని చాటుకుంటున్నారు.

కేసీఆర్ స‌న్నిహితుడిగా పేరున్న నార‌దాసు ల‌క్ష్మ‌ణ‌రావు, ఇన్నాళ్లు అవివాహితుడిగానే ఉన్నాడు. ప్ర‌జ‌ల కోసం దాదాపుగా 60యేళ్ల పాటు జీవితాన్ని అంకితం చేశాడు. అలాంటి నార‌దాసు ఎమ్మెల్సీగా కొన‌సాగుతున్నాడు. ఆయ‌న‌, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా హిమాయ‌త్ న‌గ‌ర్‌కు చెందిన లాయ‌ర్ వ‌ర్ష‌ను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింద‌ని, పెళ్లికి వ‌య‌సుతో సంబంధం లేద‌ని దానికి వీరిద్ద‌రే సాక్ష్య‌మ‌ని ఆయ‌న స‌న్నిహితులు చెబుతున్నారు.

నార‌దాసు, వ‌ర్ష ఇద్ద‌రు రెడ్‌హిల్స్ రిజిస్ట్రార్ ఎదుట పెళ్లి చేసుకున్నారు. వీరికి ప‌లువురు శుభ‌కాంక్ష‌లు తెలిపారు. సోష‌ల్ మీడియాలో కూడా నార‌దాసుకు విషెస్ చెబుతున్నారు. త్వ‌ర‌లో కొద్దిమంది స‌న్నిహితులకు పార్టీ ఇవ్వ‌నున్న‌ట్టు స‌న్నిహితులు చెబుతున్నారు. న్యూస్ఈజ్‌పీపుల్ కూడా ఆయ‌న‌కు విషెస్ చెబుతోంది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *