విడాకులు తీసుకోనున్న సెలబ్రెటీ జంట?

Views: 235

అమెరికాలో విడాకులు అత్యంత సర్వసాధారణం..హాలీవుడ్ స్టార్లు, రియాల్టీ, పాప్ సెలబ్రిటీలు పట్టుమని పది రోజుల కూడా కలిసి ఉండకుండా విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. అమెరికన్ రియాల్టీ స్టార్ కిమ్ కర్ధాషియన్, మ్యూజికల్ స్టార్ (ర్యాపర్) కన్యే వెస్ట్ జంట కూడా విడిపోయేందుకు సిద్ధమయినట్లు సమాచారం.

ఈ యేడాది అక్టోబర్ లో పారిస్ హోటల్ లో కర్ధాషియన్ ను బంధించిన గుర్తు తెలియని దుండగులు భారీ మొత్తంలో నగలు, నగదు దోచుకెళ్లినప్పటి నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.  కిమ్ తల్లి ఇచ్చిన క్రిస్టమస్ పార్టీలో పాల్గొనకూడదని కిమ్ తన భర్త కన్యేకు సీరియస్ గా వార్నింగ్ కూడా ఇచ్చిందట. దీంతో మనస్థాపం చెందిన ఆయన తన ఫ్రెండ్స్ తో కలిసి ఆ సమయంలో సినిమాకెళ్లాడు. సినిమా  అయిపోగానే  తిరిగివచ్చిన కిమ్ తల్లిచ్చిన క్రిస్టమస్ పార్టీలో చివర్లో పాల్గొన్నాడు. కన్యే ఇలా చేయడం కిమ్ కు నచ్చలేదు. ఇద్దరు అక్కడ పొడిపొడిగా మాట్లాడుకున్నారు.

కన్యే పెళ్లి సందర్భంలో ప్రెజెంట్ చేసి రింగ్ కూడా కిమ్ పక్కన పడేసింది. ఇప్పుడు కిమ్ కేవలం పిల్లల భవిష్యత్ కోసమే ఆలోచిస్తుందని సన్నిహితులు చెబుతున్నారు.  కన్యే కొంతకాలం నుంచి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన దానికి కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నాడు. కౌన్సిలింగ్ తీసుకుంటూనే ఇటీవల అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైనా డొనాల్డ్ ట్రంప్ ను కలవడానిక వెళ్లాడు. అది కిమ్ కు ఏమాత్రం నచ్చలేదు. ట్రంప్ కలవొద్దని కిమ్ వార్నింగ్ ఇచ్చినప్పటికీ..కన్యే ఆమె మాటలు పెడచెవిన పెట్టాడని అదే కిమ్ తెగదెంపులు చేసుకోవడానికి దారి తీసిందని సన్నిహితులు అంటున్నారు.

2013లో కిమ్-కన్యేల పెళ్లి జరిగింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. కన్యేకు ఇదే మొదటి పెళ్లికాగా, కిమ్ 2004లో తాను 20ఏళ్ల వయసులో ఉండగా ఓ మ్యూజిక్ స్టార్ తో ఇంట్లో చెప్పపెట్టకుండా లేచిపోయి పెళ్లి చేసుకుంది. నాలుగేళ్లపాటు అతనితో కలిసున్న కిమ్ ఆ తర్వాత విడాకులు తీసుకుంది. 2011లో మరో వ్యక్తిని పెళ్లాడింది కానీ అది 72రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత విడాకులు తీసుకున్న కిమ్ 2013 చివర్లో కన్యేను పెళ్లాడింది. కిమ్ కు ఇది మూడో పెళ్లి కాగా…కన్యేకు మొదటిది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *