కేంద్రం కొత్త ఏడాది ఆఫ‌ర్‌…క‌రెన్సీ క‌ష్టాలు తీరిన‌ట్టేనా..?

Views: 935

నోట్ల ర‌ద్దుతో అల్ల‌లాడుతున్న సామాన్య జ‌నానికి గుడ్ న్యూస్‌. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ కొత్త ఏడాది ఆరంభం నుంచి అదిరే ఆఫ‌ర్ల‌తో ప్ర‌జ‌ల‌ను ఎట్రాక్ట్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇప్ప‌టికే…ప్లాన్‌ను పూర్తిగా రెడీ చేసిన సెంట్ర‌ల్‌, చిన్న చిన్న మార్పులు చేసి మ‌రో రెండు రోజుల్లో అధికారికంగా ప్ర‌క‌టించేందుకు ఆస‌క్తి చూపుతోంది. దాదాపు రెండు నెల‌ల పాటు సామాన్యుడిని తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేసిన ఈ వ్య‌వ‌హ‌రం ఇప్పుడు పూర్తిగా స‌ద్దుమ‌ణిగేలా ప‌క్కా స్కెచ్ వేసింది కేంద్రం.

న‌గ‌దు ర‌హిత లావాదేవీలు జ‌ర‌గాల‌నే కాన్సెప్ట్‌తో ఇప్పుడు కేవ‌లం బ్యాంక్‌ల్లో వారానికి ఒకేసారి 24000 రూపాయాలు ఇస్తున్నారు. ఏటీఎం నుంచి 2500 రూపాయాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ రూల్‌ను బ్రేక్ చేయ‌నున్నారు. డిసెంబ‌ర్ 30 త‌ర్వాత నుంచి రోజుకు బ్యాంక్ నుంచి ఏటీఎం నుంచి తీసుకునే డ‌బ్బుల‌ను సామాన్యుడి ఉహించ‌ని రేంజ్‌కు పెంచ‌నున్నారు. అంతేకాదు…ఇలా చేయ‌డంలోనూ కేంద్రం మ‌రోసారి డిజిట‌ల్ ఇండియా అనే ట్యాగ్‌లైన్‌ను వాడ‌నుంది.

డిసెంబ‌ర్ 30 త‌ర్వాత కేంద్ర తీసుకోబోయే నిర్ణ‌యాలు క్రింద ఇవ్వ‌బ‌డిన‌వి గ‌మ‌నించ‌గ‌ల‌రు

డిసెంబ‌ర్ 30 త‌ర్వాత ప‌రిమితి –                                           ప్ర‌స్తుత ప‌రిమితి

రోజుకు గ‌రిష్టంగా బ్యాంక్‌ల నుండి 50,000                      బ్యాంక్‌ల నుండి-24000
ఏటీఎంల నుండి గ‌రిష్టంగా 15,000                                 ఏటీఎంల నుండి – 2 500

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *