అలా అయితే మీకు పిల్లలు పుట్టడం కష్టం!

Views: 365

ఒత్తిడి, పొగతాగడం, వ్యాయామాలు లాంటి లేకుండా శరీరానికి పని చెప్పకపోవడం, వాయు కాలుష్యాలు సంతాన సాఫాల్యతను దూరం చేయడంతో పాటు సెక్స్ లో పాల్గొనేలా కోరిక రోజురోజుకు క్షీణింపజేస్తున్నాయి. ఈ కారణాల వల్ల కాలుష్యం తాండవించే పట్టణాలు ముఖ్యంగా ఢిల్లీలాంటి సిటీల్లో 15శాతం పురుషుల్లో ఫెర్టిలిటీ (సంతాన సాఫాల్యం) తగ్గిపోవడంతో పాటు, 30శాతం మేర మగాళ్లలో సెక్స్ లో పాల్గొనకుండా చేస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇటీవల ఐవీఎఫ్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం..అదే పనిగా కూర్చొని ఏ పని లేని వారికి సెక్స్ కోరికలు తగ్గుముఖం పడుతున్నాయి.

పొగతాగడం, ఒత్తిడికి గురికావడం, స్థూలకాయం, స్టెరాయిడ్ లాంటి తీసుకోవడం, గాలి కాలుష్యాల వల్ల పురుషుల్లో సంతానోత్పత్తి (సెర్మ్) కౌంట్ గణనీయంగా పడిపోతుందని వైద్యులు చెబుతున్నారు. నానాటికీ జీవనశైలిలో వస్తున్న మార్పులు వల్లే ఈ సంతానోత్పత్తి అవకాశాలు తగ్గడం, దీనివల్ల గర్భస్రావాలు (మిస్ క్యారేజ్) చోటుచేసుకుంటున్నాయని వారు వివరిస్తున్నారు. స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల అది సంబోగం సమయంలో ఫలోపియన్ ట్యూబ్ ను చేరుకోవని గర్భం ధరించడం జరగదని విశ్లేషిస్తున్నారు. సంతానోత్పత్తి తగ్గిపోవడం వల్ల పురుషుల్లో సెక్స్ కోరికలు కూడా అంతరించిపోతాయని చెబున్నారు.

టెస్టోరాయిడ్స్, ఇస్టోరాయిడ్స్ తగ్గిపోవడం కూడా సెక్స్ కోరికలు తగ్గడానికి కారణమవుతాయ్. కాలుష్యం వల్ల ఓజోన్ పొర, సల్పర్ డైఆక్సైడ్ లలో వస్తున్న భారీ మార్పుల వల్ల రక్త ప్రసరణపై ప్రభావడం పడుతుంది. ఇది కూడా సెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణమవుతుంది. అందుకే ప్రతిరోజు కనీస వ్యాయమం, మంచి డైట్ మెయింటేన్ చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. టమోటాలు, స్వీట్ బంగాళదుంప, పుచ్చకాయ, క్యారెట్, గుమ్మడి విత్తులు, చేపలు, వాల్ నట్స్, దానిమ్మపండ్లు, బ్లూ బెర్రీ వంటి ఆహారంలో నిత్యం ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల సెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

మీకు తెలుసా నీళ్లు బాగా తాగడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చని. మంచినీళ్లు ఎంత ఎక్కువగా తాగి అంత ఆరోగ్యానికి మంచిది. అధిక బరువుతో సంతానోత్పత్తికి ముప్పే. అందుకే రోజు వ్యాయమం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *