2016 లవర్స్ చేసిన తప్పులు…

Views: 266

–      మీరు రిలేషన్ లో ఉన్నా, లవ్ లో ఉన్నా మీ భాగస్వామి అభిప్రాయాలకు విలువనివ్వకుండా ప్రైవసీకి పబ్లిక్ గా తేడా లేకుండా..ప్రైవేటు విషయాలన్ని పబ్లిక్ గా, లేదా ఇతరులతో చెబితే మీరు మొదటి తప్పు చేసినట్లే. ఇది మీ పార్ట్ నర్ కు తెలియక ముందే సరిదిద్దుకోండి.

–      ఒకరితో రిలేషన్ షిప్ కొనసాగిస్తూనే మరో వ్యక్తితో ‘టచ్’లో ఉంటే మీరు మీ పార్ట్ నర్ ఛీట్ చేయడంతో పాటు మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే 2016 ఎండింగ్ లోనే దానికి ఫుల్ స్టాప్ పెట్టేయండి. లేకపోతే మీరు సింగిల్ గా మిగిలిపోవచ్చు.

–      భాగస్వాములు చీటికీమాటికీ గొడవలు పడుతూ పడక గదిలో ఎవరికి వారే చెరోవైపు తిరిగి పడుకుంటారు. ఇలాంటి వారిని విడదీయడానికి మరింత దోహదం చేస్తాయి. ఈ యేడాదిలో అలా ఎప్పుడైనా చేస్తే ఇద్దరు మాట్లాడుకొని దూరాన్ని చెరిపేసి దగ్గరవ్వండి.

–      భాగస్వామి ఫోర్స్ వల్లే తాము సెక్స్ లో పాల్గొంటున్నామని, ఇష్టంలేకపోయినా ఆ పని చేయాల్సి వస్తుందని చాలా మంది ఫీమేల్ పార్ట్ నర్స్ వాపోతుంటారు. ఇద్దరికీ ఇష్టంలేని సెక్స్ యాంత్రికంగా ఉంటుంది. పోర్సుడ్ సెక్స్ కంటే మ్యూచువల్ ఇంటర్ కోర్సుకు ప్రయత్నించండి..సెక్స్ అనేది  హెల్త్ కి మాంచి ఎక్సర్ సైజ్ అని మరిచిపోకండి.

–      మీరు చెప్పిందే వేదం, అదే మీ పార్ట్ నర్ వినాలి అని ఇన్ని రోజుల పెత్తనం చేయి ఉండవచ్చు. అలాంటివాటికి డిసెంబర్ 31లోపు గుడ్ బై చెప్పండి. ఎందుకంటే అలాగే కొనసాగిస్తే భాగస్వామిలో ఆత్మన్యూనతా భావం పెరిగి..అది మరో ప్రమాదానికి దారి తీస్తుంది.

–      మీ కొత్త ఆర్గ్యూమెంట్ లో పాత విషయాలు తొవ్వడం 2016లో మీరు చేసిన అతి పెద్దపొరపాట్లలో ఇదొకటి. పదేపదే పాత విషయాలు తొవ్వడం వల్ల రిలేషన్ మరింత దెబ్బతింటుంది. 2017లో ఆ పని చేయకండి.

–      రిలేషన్ షిప్ అనేది మీలో ఎంతో మార్పును తెస్తుంది. అది మిమ్మల్ని మీరు మార్చుకోవడానికే గాక..ఇతరులతో ఎలా ఉండాలో నేర్పుతుంది. కానీ మీరు మొండిగా, పట్టుదలకు పోతే మాత్రం మీరు సింగిల్ గానే మిగిలిపోతారు. మార్పు ఆహ్వానించండి రిలేషన్లు దృఢపరుచుకోండి.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *