రిబ్బన్ కటింగ్ పీఎంను కాదు

Views: 174

తాను కేవలం రిబ్బన్ కటింగులు, శంకుస్థాపనలు, సభలు, సమావేశాలకు జ్యోతి ప్రజ్వలనలకు మాత్రమే లేనని..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తీవ్రవాదం, మానవ అక్రమ రవాణా, డ్రగ్ మాఫియా, దొంగనోట్ల ముద్రణలు ఒకే ఒక స్ట్రోక్ (పెద్దనోట్లరద్దు)తో తగ్గుముఖం పట్టాయని మోదీ గుర్తు చేశారు.

మంగళవారం ఉత్తరఖండ్ లో బీజేపీ నిర్వహించిన ర్యాలీలో మోదీ పాల్గొన్నారు.  2014లో తమకు ప్రజలు పూర్తి మెజార్టీ ఇచ్చింది కేవలం రిబ్బన్ కటింగ్, శంకుస్థాపలు, జ్యోతి ప్రజ్వలనలకు కాదని…అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడాలని..దేశాన్ని సమూలంగా మార్చాలని తమకు అధికారం కట్టబెట్టారని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ అధికారంలో ఉత్తరఖండ్ అవినీతిలో కూరుకుపోయిందని…తమకు అధికారం కట్టబెడితే ఉత్తరఖండ్ ను అన్నివిధానాల అభివృద్ధి చేస్తామని మోదీ పిలుపునిచ్చారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *