తండ్రి కొడుకులు అద‌ర‌గొట్టేస్తున్నారు..!

Views: 191

పెద్ద‌నోట్ల ర‌ద్దు రాష్ట్ర ఖ‌జానాకు పెను ముప్పే. అయినా వెయిట్ అండ్ సీ..ఏం జ‌రుగుతుందో చూద్దామ‌ని అంటున్నారు సీఎం కేసీఆర్‌. బీజేపీయేత‌ర సీఎంల‌లో కొంద‌రు ఇప్ప‌టికే కేంద్రంపై యుద్ధం ప్ర‌క‌టించేశారు. నిర్ణ‌యం వెన‌క్కి తీసుకోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. అయితే..దేశ ప్ర‌యోజ‌నాల‌తో ముడిప‌డిన విష‌యం కనుక కేసీఆర్ మాత్రం త‌నదైన స్టైల్లో విష‌యాన్ని న‌రుక్కుంటూ వ‌స్తున్నారు. వెయిట్ అండ్ సీ అంటున్న కేసీఆర్‌.. కేంద్రంపై తొంద‌ర‌పాటు విమ‌ర్శ‌ల జోలికి వెళ్ల‌కుండా ఉన్న విష‌యాన్ని మోడీకే ఖుల్లంఖుల్లా  చెబుతున్నారు.

పెద్ద‌నోట్ల ర‌ద్దు మంచిదే కావొచ్చు కానీ, రాష్ట్ర ఖ‌జానాపై దాని ప్ర‌భావం మాత్రం తీవ్రంగా క‌నిపిస్తోంది. దీంతో మిన్న‌కుండి పోవ‌టం మూర్ఖ‌త్వమ‌నే భావ‌న‌లో ఉంది రాష్ట్ర ప్ర‌భుత్వం. అలాగ‌ని..ఢి అంటే ఢి అంటూ కేంద్రంపై కాలుదువ్వుతే అస‌లుకే మోసం వ‌చ్చేలా ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్‌పై ప్రభావ‌మూ చూపించే అవ‌కాశాలున్నాయి. అందుకే నొప్పించ‌క‌..తానొవ్వ‌క ఫార్ములానే బెట‌ర్ అనుకుంటోంది రాష్ట్ర ప్ర‌భుత్వం.

సామాన్యుడి దాచుకున్న సొమ్ము, బ‌డాబాబుల బ్లాక్ మ‌నీని ఒకేలా చూడొద్ద‌న్న‌ది కేసీఆర్ ప్ర‌పోజ‌ల్. ఇదే విష‌యాన్ని మోడికి ఫోన్‌లో చెప్ప‌టంతో ఆయ‌న కేసీఆర్‌ను ఢిల్లీ రావాల‌న్నారు. పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత సామాన్యుడిని గ‌ట్టున వేసేలా ఎలాంటి విధానాలు అవ‌లంభించాలో సూచించేందుకు మీరే ఢిల్లీ రావాల‌ని కేసీఆర్‌ను ఆహ్వానించారాయ‌న‌. దీంతో ఢిల్లీ టూర్‌ను ఖాయం చేసుకున్న తెలంగాణ సీఎం..రాష్ట్ర ఖ‌జానా క‌ష్ట‌న‌ష్టాల‌తో పాటు..సామాన్యుడు ప‌డుతున్న క‌ష్టాల‌ను మోడీకి వివ‌రించేందుకు ఇప్ప‌టికే క‌స‌ర‌త్తు పూర్తిచేశారు. టెక్నిక‌ల్‌గా ఉన్న లోపాల‌ను వివ‌రించి సామాన్యుడికి ఊర‌ట క‌లిగేలా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో వివ‌రిస్తారు.

పాత నోట్ల‌తో ప‌న్నుల రాబ‌డి పెంచుకుకోవ‌టం ఎలాగో కేటీఆర్ కేంద్రానికి స‌ల‌హా ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ ప్లాన్ దేశ‌మంత‌టా బాగానే వ‌ర్కౌట్ అయ్యింది. బ‌హుశా అదే న‌మ్మ‌కంతో కేసీఆర్‌కు మోడీ అవ‌కాశం ఇచ్చార‌నే టాక్ న‌డుస్తోంది. మొత్తానికి తండ్రి కొడుకులు త‌మ రాజ‌కీయాల స్టైలే వేర‌ని చాటుకుంటున్నారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *