అమ్మ లేదుగా…ఇక స్వామి మెద‌లెట్టాడు…

Views: 840

పుర‌చ్చి త‌లైవి, జ‌య‌ల‌లిత అంత్య‌క్రియ‌లు ముగిశాయో లేదో…అప్పుడే స్వామి రంగంలోకి దిగాడు. ఆయ‌నే బీజేపీ సీనియ‌ర్ నేత‌, ఎంపీ సుబ్ర‌మ‌ణ్య స్వామి. జ‌య మ‌ర‌ణంతో ఆ పార్టీ చీలిపోతుంద‌ని జోష్యం చెప్పాడు. పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించిన శ‌శిక‌ళ , సీఎం ప‌న్నీర్ సెల్వంను ప‌ని చేయ‌నీయ‌ద‌ని చెప్పాడు. భ‌విష్య‌త్ లో శ‌శిక‌ళ ఆమె కుటుంబంలోని వారికే ప‌గ్గాలు అప్ప‌గించే చాన్స్ ఉంద‌న్నాడు. ప‌న్నీర్ సెల్వంకు రాష్ట్రాన్ని న‌డిపించేంత సీన్ లేద‌ని, త్వ‌ర‌లోనే ఏఐఏడీఎంకే పార్టీ చీలుతుంద‌న్నాడు సుబ్ర‌మ‌ణ్య‌స్వామి..గ‌తంలో మ‌హామ‌హ కుంభ‌కోణాల‌నే వెలికి తీసి, కాంగ్రెస్ నేత‌ల‌కు చుక్క‌లు చూపించిన స్వామి ఇప్పుడు ఏఐఏడీఎంకే పార్టీని టార్గెట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది. జ‌య‌ల‌లిత‌పై అక్ర‌మ ఆస్తుల కేసును కోర్టుకు లాగింది కూడా సుబ్ర‌మ‌ణ్య స్వామియే..

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *