కేంద్రం లీకిచ్చింది..బాబు స‌ర్దుకున్నాడు: జ‌గ‌న్‌

Views: 196

నోట్ల ర‌ద్దు జ‌రిగిన రెండు వారాల త‌ర్వాత జ‌గ‌న్ పిచ్‌లోకి వ‌చ్చారు. వ‌చ్చి రాగానే ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. నోట్ల ర‌ద్దుకు మూడు రోజుల ముందే హెరిటేజ్ అమ్మ‌కం వెన‌క ఆంత‌ర్య‌మేంటో అర్ధం తెలియ‌దా? అంటూ మ‌న‌సులో మాటను కుండ‌బ‌ద్ధ‌లు కొట్టేశారు. కేంద్రం ప్ర‌క‌ట‌న త‌ర్వాత స్టాక్‌మార్కెట్ ద‌గ్గ‌ర్నుంచి పేదోడి వ‌ర‌కు కుదేలైపోతుంటే..హెరిటేజ్‌ షేర్ మాత్రం ఆమాంతంగా 450 శాతం పెర‌గ‌టానికి కార‌ణాలు ఎంటీ? అంటూ అధికార‌ప‌క్షంపై గురిపెట్టారు.

కేబినెట్‌లో కూడా ఎవ‌రికి తెలియ‌కుండా సీక్రెట్‌గా ప్లాన్ అమ‌లు చేస్తే..బాబు ముందే ఎలా స‌ర్దుకున్న‌ట్లు అనేది జ‌గ‌న్ డౌటు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై విష‌యం ముందే తెలుసు కాబ‌ట్టే కేంద్రానికి లెట‌ర్ రాసి క్రెడిట్ కొట్టేద్దామ‌నుకున్న బాబు..ర‌ద్దు కాస్తా తేడా కొట్టేస‌రికి ర‌ణ‌రంగం నుంచి సైడ‌య్యారంటూ సెటైర్లూ పేల్చారు. కేబినెట్లోనే టీడీపీ మంత్రులున్నారు. నోట్ల ర‌ద్దుపై ముందే బాబుకు లీకైంద‌న్న‌ది జ‌గ‌న్ వ్యూ పాయింట్‌. అందుకే ఆయ‌న వారం ముందుగానే స‌ర్దుకొని గ‌ట్టుమీద కూర్చున్నాడంటూ ఆరోపించారు.

53 శాత‌మే బ్యాంక్ అక్కౌంట్లు ఉన్న‌దేశం మ‌న‌ది. 86 శాతం పెద్ద నోట్లు చ‌లామ‌ణిలో ఉన్నాయి. చ‌లావ‌ర‌కు గ్రామీణ‌ప్రాంతాలు క్యాష్‌తోనే లావాదేవీలు న‌డుస్తున్నప్పుడు ఎలాంటి ముందుజాగ్ర‌త్త‌లు తీసుకోకుండా పోలోమంటూ వ‌చ్చి నోట్ల ర‌ద్దు ప్ర‌క‌టిస్తే…కూలీనాలీ చేసుకొని బ‌తికేవాళ్ల‌కు పూట గ‌డిచేదెలా అంటూ నిల‌దీశారాయ‌న‌. ఉన్నబాబులు బాగానే ఉన్నారు. లేనోడో చితికిపోతున్నాడంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాడంటూ ఎట్ట‌కేల‌కు నోట్ల ర‌ద్దుపై గొంతు విప్పాడు జ‌గ‌న్‌.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *