జ‌గ‌న్ లేటు రియాక్ష‌న్ వెన‌క అంత మ్యాట‌రుందా..?

Views: 400

పొలిటిక‌ల్ లేజీ బోయ్.. మొద్ద‌బ్బాయ్‌గా ప‌క్క‌పార్టీలు సెటైర్లు పేల్చే రాహుల్‌గాంధీలాంటి వ్య‌క్తే పెద్ద నోట్ల రద్దు ప్ర‌క‌ట‌న త‌ర్వాత వెంట‌నే ఫీల్డ్‌లోకి దిగారు. పెద్ద‌నోట్ల ర‌ద్దుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. అటు ప్రాంతీయ పార్టీలు సైతం ఢిల్లీ వేదిక‌గా చేసుకొని ర‌చ్చ రచ్చ చేస్తున్నాయి.  కానీ, జ‌గ‌న్ టీం మాత్రం రెండు వారాల పాటు క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌లేదు. లెట‌ర్ రాసి పెన్నుక‌ర్చుకున్న బాబును ఏకీ పారేయ‌కుండా  జ‌గ‌న్ మౌనంగా ఉండ‌టానికి కార‌ణం ఏంట‌బ్బా..! అంటూ సొంత‌పార్టీలో కొంత చ‌ర్చ న‌డిచింది. అయితే..ఆయ‌న రెండు వారాల మౌనం వెన‌క పెద్ద లాజిక్కే ఉంది.

జ‌గ‌న్‌ను బ్లాక్‌మ‌నీకి కేరాఫ్ అంటూ టీడీపీ ఎప్పుడో ముద్ర వేసింది. డ‌బ్బుకు సంబంధించి జ‌న‌గ్ సీన్‌లోకి వ‌చ్చిన ప్ర‌తిసారి కేసులు, ఛార్జీషీట్లు అంటూ ఎదురుదాడికి దిగ‌టం త‌మ్ముళ్ల‌కు చాలా ఈజీ ప్రాసెస్‌. ఇలాంటి సిచ్యూవేష‌న్‌లో బ్లాక్‌మ‌నీపై వైసీపీ యాక్ష‌న్‌ప్లాన్ స్పీడ‌ప్ చేస్తే అదికాస్తా తేడాకొట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు. బ్లాక్‌మ‌నీ దాచుకున్నాడు కాబ‌ట్టే..దేశంలో ఎవ‌రికి లేని భ‌యం జ‌గ‌న్ పార్టీని వెంటాడుతుంద‌ని అధికార‌ప‌క్షం ఈజీగా జ‌గ‌న్ టీంను కార్న‌ర్ చేసే ప్ర‌మాదం ఉంది.

అందుకే జ‌గ‌న్ బ్లాక్‌మ‌నీ బాక్స్ బ‌ద్ధ‌ల‌య్యేలా అర‌వ‌కుండా..జ‌నంలో నుంచి రియాక్ష‌న్ వ‌చ్చే వ‌ర‌కు ఎదురుచూసి..మెల్లిగా సిన్లోకి వ‌చ్చి సింక‌య్యే డైలాగుల‌తో త‌న వాయిస్ పెంచే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఇక రెండో కార‌ణం…పెద్ద‌నోట్ల ర‌ద్దు, దాని ప్ర‌భావాలు అనే అంశం మీద భారీగానే క‌స‌ర‌త్తు చేశారు జ‌గ‌న్‌. అన్ని సెక్టార్ల నుంచి రిపోర్ట్‌లు తెప్పించుకొని మ‌రీ అప్పటికీగానీ ప్రెస్‌మీట్‌కు రెడీ కాలేదు. మొత్తానికి లేటుగానైనా లేటెస్ట్ లెక్క‌ల‌తో జ‌గ‌న్ వాయిస్ రెయిజ్ చేశారు. చంద్రబాబు ముందే లీకైందంటూ బాంబ్ పేల్చారు. ఇదంతా విన్నాక త‌మ్ముళ్లు మాత్రం గ‌మ్మునుంటారా..? రోటీన్‌గానే త‌మ పాత డైలాగుల‌తో కేసులు, ఛార్జీషీట్లంటూ జ‌గ‌న్‌కు ఎదురుదాడి త‌ప్ప‌దుగా మ‌రి. అయితే..ఆ ఎదురుదాడి ఎలా ఉంటుంద‌నేది చూడాలి మ‌రి.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *