చంద్రంసారుకు నోటు పోటు..!

Views: 334

పాపం చంద్రం సారు. ఎక్క‌డ ఏ నోటు గొడ‌వ జ‌రిగినా..అటు తిరిగి ఇటు తిరిగి చివ‌రికి సారు సీటు కిందికే వ‌స్తోంది. జ‌నం స‌మ‌స్య‌ల కంటే అదే బాబుగారికి పెద్ద స‌మ‌స్యై కూర్చొంటోంది. ఇదెక్క‌డి గొడ‌వ‌రా బాబు అంటూ మ‌న బాబుగారు మ‌ళ్లీ దానిపై వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. చివ‌రికి త‌న‌కు సంబంధం లేని పెద్ద నోట్ల ర‌ద్దు అంశం కూడా చంద్ర‌బాబును డిఫెన్స్‌లో ప‌డేలా చేశాయి. మా సారు లేఖ‌తోనే వెయ్యి కోట్ల ర‌ద్దు అయిన‌ట్లు త‌మ్ముళ్ల ప్ర‌చారం బాగానే ఉన్నా..అది కాస్తా బుమారాంగ్ అవ‌టంతో..ఎల్లో డ్రెస్ డిఫెన్స్‌లో ప‌డాల్సి వ‌చ్చింది.

అప్ప‌ట్లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎలక్ష‌న్ టైం మొద‌లు బాబుగారికి నోటు పోటు మొద‌లైంది. రేవంత్ అడ్డంగా బుక్క‌వ‌టంతో ఓటుకు నోటు మేట‌ర్ బాబును కార్న‌ర్ చేసింది. చంద్ర‌బాబే ఇదంతా చేయించిన‌ట్లు పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఏపీలో ప్ర‌తిప‌క్షాలు గ‌గ్గోలు పెట్టాయి. చంద్ర‌బాబును రేపో మాపో అరెస్ట్ చేస్తార‌నే పుకార్లు షికార్లు చేశాయి. చివ‌రికి ఓ బ‌హిరంగస‌భ‌లో చంద్ర‌బాబు ఆవేశంగా మాట్లాడుతూనే వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

త‌ర్వాత ఏపీకి క‌రెన్సీ క‌ష్ట‌కాలం వ‌చ్చి ప‌డింది. విభ‌జ‌న‌తో ఏర్ప‌డ్డ రెవెన్యూలోటును త‌ట్టుకునేందుకు చంద్ర‌బాబు కిందామీద ప‌డాల్సివ‌స్తోంది. ఇప్ప‌టికే ఆ క‌రెన్సీ క‌ష్టాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అదోర‌క‌మైన నోటు పోటు. ఇక ఇప్పుడు పెద్ద నోట్ల ర‌ద్దు ఇష్యూ కూడా చంద్ర‌బాబును బ‌జార్లోకి లాగింది. నోట్ల ర‌ద్దు కొద్ది రోజుల ముందే ఏపీ నుంచి ప‌దివేల కోట్ల ఐటీ రిట‌ర్న్స్ దాఖ‌లవ‌టం పెద్ద దుమార‌మే రేగింది. అవి జ‌గ‌న్ చూపిన లెక్క‌లు అని టీడీపీ ఆరోపిస్తే..కాదు, టీడీపీ నేత‌ల దొంగ‌సొమ్మే అంటూ పెద్ద ర‌చ్చే జ‌రిగింది. మోడీ ప్ర‌క‌ట‌న‌కు దాదాపు ప‌ది రోజుల ముందే హెరిటేజ్ అమ్మ‌కం కూడా ఇష్యూ అయ్యింది. దీంతో ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల ప్రాధాన్య‌మున్న టీడీపీ అధినేత‌కు మోడీ నిర్ణ‌యం ముందే తెలుస‌ని ప్ర‌చారమూ జ‌రిగింది. దీంతో మ‌ళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి నోటు పోటుపై చంద్ర‌బాబు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *