ఫాదర్ స్ట్రోక్ .. సీఎం అఖిలేష్ సస్పెండ్

Views: 270

దేశరాజకీయాల్లో మరో సంచలనం. సమాజ్ వాదీ పార్టీ నిట్టనిలువునా చీలిపోయింది. ఆ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తనయుడు యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరించారు. అంతేకాదు అఖిలేష్ బాబాయ్ కి కూడా స‌స్పెన్ష‌న్ వేటు త‌ప్ప‌లేదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న‌ రామ్ గోపాల్ యాదవ్ ను కూడా సస్పెండ్ చేశారు. పార్టీ నిబంధనలు ఉల్లంఘించార‌ని, క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడ్డారని పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో తండ్రీకొడుకుల మ‌ధ్య అగ్గిరాజుకోవ‌డం పార్టీ శ్రేణుల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. చాలా రోజుల నుంచి స‌మాజ్ వాది పార్టీలో బాబాయ్ -అబ్బాయి గొడ‌వ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఐతే అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో తండ్రీ కొడుకుల సంబంధం పూర్తిగా చెడింది. ములాయం 393 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటిస్తే అఖిలేష్ 235 మంది తన క్యాండిడేట్ల లిస్టు ప్రకటించారు.

రామ్ గోపాల్ యాదవ్ చెప్పుడు మాటలు విని అఖిలేష్ చెడిపోయాడని… ఇద్దరు కలిసి పార్టీని నాశనం చేస్తున్నారని ములాయం మండిపడ్డారు. పార్టీ పటిష్టతే తనకు ప్రాధాన్యమని అధినేత‌ స్పష్టం చేశారు. ఇక‌ అఖిలేష్ అండ్ టీం కొత్తపార్టీ ఏర్పాటు చేసుకునే దిశ‌గా అడుగులు చ‌క‌చ‌కా వేస్తోంది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *