జియో, పేటీఎంతో మోడీకేంటి సంబంధం..?

Views: 313

ఫ్రీ డేటా, ఫ్రీ వాయిస్ కాల్స్ అంటూ రిల‌య‌న్స్ ప్ర‌వేశ‌పెట్టిన జియో….దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. జియో సిమ్ కార్డ్ లు ఇప్పుడు కూడా మార్కెట్లో ఫ్రీగానే దొరుకుతున్నాయి. రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఈ ఫ్రీ ఆఫ‌ర్ ను మార్చి31 వ‌ర‌కు పొడించిన‌ట్టు కూడా స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. ఐతే దీని వెన‌క ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ స‌పోర్ట్ ఉంద‌ని విప‌క్షాల ఆరోప‌ణ‌ల ప‌ర్వం కొన‌సాగుతూనే ఉంది. తాజాగా పేటీఎం విష‌యంలోనూ ప్ర‌ధాని తెర‌వెన‌క ఏదో న‌డిపిస్తున్నాడంటూ వార్త‌లు గుప్పుమంటున్నాయి.

ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ తాజాగా ఇదే విష‌యాన్నిట్విట్ట‌ర్ లో ప్ర‌స్తావించారు. మోడీ మొద‌ట చాయ్ అమ్మాడ‌ని, ఆ త‌ర్వాత జియో సిమ్ లు అమ్మాడ‌ని, ఇప్పుడు పేటీఎంను అమ్ముతున్నాడ‌ని, ఆ త‌ర్వాత దేశాన్నే అమ్మేస్తాడంటూ …త‌న వ‌ద్ద ఎవ‌రో ప్ర‌స్తావించారని ట్వీట్ చేశారు. ఎవ‌రు అన్నా అన‌క‌పోయినా కేజ్రీవాల్ మాట అదే అన్న విష‌యం జ‌నాల‌కు తెలిసిందే. పెద్ద‌ నోట్ల ర‌ద్దు అనంత‌రం న‌వంబ‌ర్ 9న జాతీయ మీడియాలోనూ ఇదే విష‌యంపై క‌థ‌నాలు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత అంతా మ‌ర్చిపోయార‌నుకున్నాడో ఏమో కేజ్రీవాల్ మ‌ళ్లీ అదే విష‌యాన్ని తెర‌మీద‌కి తెచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

aap-ak

పెద్ద నోట్ల ర‌ద్ద త‌ర్వాత‌ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుండ‌డంతో.. క్యాష్ లెస్ లావాదేవీల‌పై ప్ర‌జ‌లు దృష్టి సారించాల‌ని ప్ర‌ధాని మోడీ ప‌దేప‌దే చెబుతున్నారు. ఇప్ప‌టికే అనేక గ్రామాల్లోనూ స్వైపింగ్ మెషీన్ల ద్వారా లావాదేవీలు జ‌రుగుతున్నాయి. న‌గ‌దు ర‌హిత లావాదేవీల సౌక‌ర్యాన్ని ఎప్ప‌ట్నుంచో అందిస్తున్న పేటీఎం…రీసెంట్ గా మ‌రింత పుంజుకుంది. ఆ సంస్థ సేవ‌లు, బ్రాండ్ వాల్యూ గ‌ణ‌నీయంగా పెరుగుతోంది. తాజాగా మ‌నీ ట్రాన్స్ ఫ‌ర్ ను కూడా పేటీఎం అందుబాటులోకి తెచ్చింది. ఐతే మోడీ పేటీఎంతో ర‌హ‌స్య ఒప్పందాలు కుదుర్చుకున్నాడంటూ కేజ్రీవాల్ స‌హా విప‌క్షాలు ఆరోపిస్తున్నారు. అధిక శాతం ప్ర‌జ‌లు మాత్రం ప్ర‌ధానికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు. జియో, పేటీఎంల‌తో ఒప్పందాలు చేసుకోవాల్సిన అవ‌స‌రం ప్ర‌ధానికి లేద‌ని….విప‌క్షాలు మోడీపై బుర‌ద చల్లే ప్ర‌య‌త్నం చేస్తున్నాయ‌ని అంటున్నారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *