రోజా లైఫ్ లోనూ ‘అమ్మ’ పాత్ర

Views: 398

ఎంతో మంది జీవితాల‌ను ప్ర‌భావితం చేసిన గొప్ప నాయ‌కి జ‌య‌ల‌లిత…సౌత్ ఇండియ‌న్ న‌టి, ఎమ్మెల్యే రోజా జీవితంలోనూ కీల‌క పాత్ర పోషించింది. అమ్మ‌ మృతి మ‌హిళా లోకానికే తీర‌ని లోట‌ని ఆవేద‌న చెందిన‌ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా…అమ్మ‌తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు సెల్వ‌మ‌ణిని వివాహం చేసుకున్న‌పుడు రోజాకు అండ‌గా నిలిచింది జ‌య‌ల‌లితే.

అంతేకాదు రోజా రాజ‌కీయ జీవితాన్ని సైతం అమ్మ ప్ర‌భావితం చేశారు. 2014 ఎన్నిక‌ల్లో రోజా చిత్తూరు జిల్లా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ విజ‌యంలో జ‌య‌ల‌లిత పాత్ర ఎంతో ఉంది. రోజాను వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించ‌డ‌మే కాకుండా.. జ‌య‌ల‌లిత‌ త‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను రోజా ప్ర‌చారానికి పంపి…ఆమె విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *