ప్ర‌ణ‌బ్ కే ఎందుకిలా జ‌రుగుతోంది..?

Views: 229

భార‌త రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ద‌క్షిణ రాష్ట్రాల్లో పెట్టాలంటే ఒక‌టి రెండు సార్లు ఆలోచించుకోవాలేమో…ఎందుకంటే కీల‌క స‌మ‌యాల్లోనే ప్ర‌ణ‌బ్ కు ప‌రిస్థితులు హ్యాండ్ ఇస్తున్నాయి. తాజాగా త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత పార్థీవ దేహాన్ని చూసేందుకు ఢిల్లీ నుంచి చెన్నై బ‌య‌లుదేరిన దాదాకు…మ‌ధ్య‌లోనే ఆటంకం ఎదురైంది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో, చెన్నైకి రాకుండానే విమానం తిరిగి వెళ్లిపోయింది.

ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ మెద‌క్ జిల్లాలోని ఎర్ర‌వెల్లిలో అయిత చండీయాగం నిర్వ‌హించిన‌పుడు కూడా దాదా ఇటువంటి ప‌రిస్థితినే ఫేస్ చేశారు. ప్ర‌ణ‌బ్ మ‌రికాసేప‌ట్లో ఎర్ర‌వ‌ల్లి చేరుకుంటార‌న‌గా, చండీయాగం చేస్తున్న మండ‌పంలో మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆయ‌న చండీయాగానికి రాకుండానే ఢిల్లీకి వెళ్లిపోయారు. దాదాకే ఎందుకిలా జ‌రుగుతోందంటూ పొలిటిక‌ల్ చ‌ర్చ జ‌రుగుతోంది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *