షాకింగ్…మార్కెట్లోకి ఖైదీ నెంబ‌ర్ 150 పైర‌సీ మూవీ?

Views: 2863

మెగాస్టార్ చిరంజీవి అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌. ఓ ర‌కంగా అభిమానుల్లో కొంద‌రి అత్యుత్సాహ‌మే ఈ ప‌రిస్థితికి కార‌ణం. ఫ‌లితంగా..వెండితెర‌పై బొమ్మ‌ప‌డ్డ కొద్దిక్ష‌ణాల‌కే, ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌ల్లో మూవీకి సంబంధించిన విజువ‌ల్స్ రావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. అంతేకాదు..కొన్ని వెబ్‌సైట్ల‌లో సినిమా ఉందంటూ, సోష‌ల్ మీడియాలో లింక్‌లు పెట్ట‌డం ఇప్పుడు అంద‌రిని కంగారుకు గురిచేస్తుంది. మూవీ రిలీజైన మూడు గంట‌ల‌లోపే పైర‌సీ చేశార‌నే వార్త‌లు షాక్‌కు క‌ల్గిస్తున్నాయి.

ఈ మూవీలో హైలైట్ సాంగ్ అమ్మ‌డు లేట్స్ డు కుమ్ముడు. ఈ పాట‌లో రామ్‌చ‌ర‌ణ్ స్పెష‌ల్ అప్పీరియెన్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తాడ‌ని డైరెక్ట‌ర్‌తో పాటు చిరంజీవి కూడా చెప్పాడు. ఇప్పుడీ పాట మొత్తం…వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. మూడున్న‌ర నిమిషాల పాటు ఉండే ఈ పాట పూర్తిగా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇందులో దేవీ శ్రీ ప్ర‌సాద్‌తో పాటు, రామ్‌చ‌ర‌ణ్ తేజ్ క‌నిపించారు. ఇలాంటి క్రేజ్ ఉన్న సాంగ్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇక‌, మూవీలో చిరంజీవి ఇంట్ర‌డ‌క్ష‌న్ సీన్ కూడా లీకైంది. చివ‌ర్లో క‌త్తి శీను, శంక‌ర్‌లా మారే సీన్‌ను లీక్ చేశారు. వీట‌న్నింటికీ తోడుగా ర‌త్తాలు ర‌త్తాలు సాంగ్‌ను కూడా లీక్ చేశారు. మొత్తంగా…దాదాపుగా 15నిమిషాల సీన్స్ లీక‌య్యాయి. వీటిని సెల్‌ఫోన్ ద్వారా తీశారు. కొన్ని సీన్స్ చాలా క్లియ‌ర్‌గా దుబాయ్ షోలో తీసిన‌ట్టుగా అర్థ‌మవుతోంది. ఇంగ్లీష్‌, ఉర్ధూలో టైటిల్స్ ఉన్నాయి. మ‌రికొన్నింటిని తెలుగు స్టేట్స్‌లో తీసిన‌ట్టుగా తెలుస్తోంది. దీనిపై స్పెష‌ల్ ఫోక‌స్ పెట్ట‌క‌పోతే, మూవీకి ఇబ్బందులు త‌ప్పేలా క‌నిపించ‌డం లేదు.

నోట్ – చిత్రానికి సంబంధించిన లీకైన ఫూటేజ్‌ను మేము అందివ్వ‌లేం. అలా చేసి పైర‌సీ గాళ్ల‌ను ప్రొత్స‌హించ‌లేం.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *