వికీలీక్స్ ‘అక్టోబర్ బాంబు’

Views: 238

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీకి (నవంబర్ 8) ముందే ఆదేశానికి సంబంధించిన ముఖ్యమైన డాక్యూమెంట్లను లీక్ చేయనున్నట్లు వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజే ప్రకటించారు. నవంబర్ మొదటివారం నుంచి వరుసగా వారానికో కొత్త అంశం చొప్పున పదివారాల పాటు ప్రామూఖ్యమైన లీకులు ఉంటాయని ఆయన బెర్లిన్ లో వెల్లడించారు. వీకిలీక్స్ ప్రారంభించి పదేళ్లు అవుతున్న సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలతో పాటు గూగుల్, చమురు, ఆయుధాలు, యుద్ధం వంటి ప్రముఖ అంశాలపై తాము సేకరించిన, తమకు అందిన రహస్యాలు బట్టబయలు చేస్తామని అసాంజే స్పష్టం చేశారు. హస్యాలు లేని సమాజం కోసం అంటూ గత పదేళ్లుగా వివిధ అంశాలపై ప్రపంచవ్యాప్తంగా దాగిన రహస్యాలను చేధిస్తూ వాటిని బహిర్గతం చేస్తున్న జూలియన్ అసాంజే ప్రస్తుతం లండన్ లో ఆశ్రయం పొందుతున్నారు. అయితే తాను ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీయడం లేదని స్పష్టం చేసిన అసాంజే…వీకిలీక్స్ తరపున ఇప్పటి వరకు వివిధ అంశాలపై కోటిదాకా లీకులు చేసినట్లు గుర్తు చేశారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *