పరి‘వార్’: ములాయంకు ‘సన్’స్ట్రోక్

Views: 211

సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో వార్ మొదలైంది. కొడుకు, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తండ్రితో సమరానికి సై అన్నాడు. చిన్నాన్న, యూపీ ఎస్పీ అధ్యక్షుడు శివపాల్ ను తన మంత్రివర్గంలో నుంచి తొలగిస్తూ అఖిలేష్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శివపాల్ తో పాటు మరోముగ్గురు మంత్రులను కూడా కేబినేట్ నుంచి ఇంటికి పంపించాడు.

తమ కుటుంబంలో కలతలకు అమర్ సింగ్ కారణమని ఆరోపించిన అఖిలేష్ యాదవ్..తొలగించిన మంత్రులు బీజేపీకి తొత్తులు మారారని మండిపడ్డారు. తన తమ్ముడిని కొడుకు అఖిలేష్ మంత్రివర్గం నుంచి తొలగిస్తే… తన కజిన్ అఖిలేష్ వర్గంలో ఉండే  రాజ్యసభ సభ్యుడు రాం గోపాల్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు ములాయం.

అఖిలేష్ టీంలోకి పార్టీ కార్యకర్తలంతా రావాలంటూ రాంగోపాల్ యాదవ్ ఆదివారం ఉదయం క్యాడర్ కు లేఖ రాశారు. ఈయనే అఖిలేష్ పెట్టబోయే కొత్తపార్టీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూసుకుంటున్నట్లు సమాచారం. ఆదివారం ఎస్పీలోనూ ప్రభుత్వంలోనూ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ములాయం సమావేశం ఏర్పాటు చేశారు. దానికంటే ముందే ఆదివారం మధ్యాహ్నాం తన వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అఖిలేష్ యాదవ్ మీటింగ్ పెట్టారు. ఇందులో పాల్గొనేందుకు శివపాల్ కు ఆహ్వానం లేదు. అయితే త్వరలో పెట్టబోయే పార్టీ గురించి చర్చించేందుకే అఖిలేష్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం.

దీనికితోడు తండ్రి నవంబర్ 5 జరుపబోయే పార్టీ ఆవిర్భావ సంబరాలకు హాజరుకాకుండా…తాను నవంబర్ 3న ప్రారంభించే సమాజ్ వాది వికాస్ రథయాత్రను సక్సెస్ చేయాలని అఖిలేష్ నేతలకు చెప్పినట్లు తెలిసింది. ప్రోగ్రెసివ్ సమాజ్ వాది పార్టీ (ఎస్ఎస్‌పీ) పేరుతో అఖిలేష్ పార్టీ పెడుతున్నట్లు ఆయన శిబిరం చెబుతోంది.

సమాజ్ వాది పార్టీ గుర్తుగా సైకిల్ ఉంటే…దానికి పోటీగా అప్ డేటెడ్‌గా మోటార్ సైకిల్ (బైకు)ను కొత్తపార్టీకి గుర్తుగా ఉండబోతుందని  అఖిలేష్ వర్గం అంటోంది. సమాజ్ వాది పరివారంలో రేగిన వార్ కు ప్రతిపక్షాలకు పండగన తెచ్చిపెట్టింది. ఎస్పీ ఓ మునిగిపోయే నావ అని కాంగ్రెస్ అంటే..ఇన్నాళ్లు దోచుకున్నది పంచుకోవడంలో వివాదాలు తలెత్తాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎస్పీ గూండాయిజం, బీఎస్పీ అవినీతిలకు వ్యతిరేకంగా…స్వచ్ఛమైన పాలనను అందిచాలంటే అప్నాదళ్-బీజేపీ సంకిర్ణాన్ని గెలిపించాలని కేంద్రమంత్రి అనుపమ పటేల్ అంటున్నారు. అయితే పార్టీ నుంచి కొంతమందిని తొలగించినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని మంత్రి అజాంఖాన్ అంటున్నారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *