ఆ బ్యాంక్ లో 44 ఫేక్ అకౌంట్లు..రూ. 450 కోట్లు

Views: 256

ఢిల్లీ సెంట్ర‌ల్ లోని చాందిన్ చౌక్ లో గ‌ల యాక్సిస్ బ్యాంక్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. ఈ బ్యాంక్ లో 44 ఫేక్ అకౌంట్లు ఉన్న‌ట్టు వారు గుర్తించారు. వంద కోట్ల విలువైన పాత పెద్ద నోట్లు ఆ ఫేక్ అకౌంట్ల‌లో జ‌మైన‌ట్టు తెలిపారు. న‌వంబ‌ర్ 8న ప్ర‌ధాని మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న చేసిన తెల్లారి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ బ్యాంకులో పెద్ద మొత్తంలో పాత న‌గ‌దు డిపాజిట్ అయిన‌ట్టు తేల్చారు.

న‌వంబ‌ర్ 8 త‌ర్వాత యాక్సిస్ బ్యాంక్ చాందినీ చౌక్ బ్రాంచ్ లో మొత్తం 450 కోట్ల రూపాయ‌లు డిపాజిట్ అయ్యాయ‌ని ఐటీ అధికారులు తెలిపారు. 44 అకౌంట్ల‌ను ఫేక్ అకౌంట్లుగా గుర్తించిన అధికారులు, వారి వివ‌రాల‌ను సేక‌రించారు. ఫోర్జ‌రీ చేసిన డాక్యుమెంట్ల‌తో అకౌంట్ల‌ను క్రియేట్ చేసుకున్న‌ట్టు తెలిపారు. అకౌంట్ల‌లో ఉన్న భారీ మొత్తంతో బంగారం కొనేందుకు ప్లాన్ చేసి ఉండొచ్చ‌ని అధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

నోట్ల ర‌ద్దు ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి ఢిల్లీలో యాక్సిక్ బ్యాంకుపై ఐటీ అధికారులు రైడ్ చేయ‌డం ఇది రెండోసారి. అంత‌కు ముందు ఢిల్లీలోకి క‌శ్మీరీ గేట్ బ్రాంచ్ లో త‌నిఖీలు నిర్వ‌హించగా ఇద్దరు వ్య‌క్తులు రూ.3.5 కోట్ల‌ను జ‌మ చేసిన‌ట్టు తేలింది. డిసెంబ‌ర్ 30లోపు మ‌రెంత మందిని ఐటీ అధికారులు బ్లాక్ బాబులుగా గుర్తిస్తారో….ఎంత మంది బ్యాంకు అధికారుల భాగోతం బ‌య‌ట‌ప‌డుతుందోన‌ని సామాన్యులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *