స్మార్ట్ ఫోన్ యూజ‌ర్స్ ఇది త‌ప్ప‌క చ‌ద‌వండి

Views: 306

ఇది టెక్నాలజీ యుగం. ప్రత్యేకించి స్మార్ట్ ఫోన్ల కాలం. మార్కెట్లోకి దూసుకొచ్చే రకరకాల స్మార్ట్ ఫోన్లు యువతరాన్ని విఫరీతంగా ఆకర్శిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ల వాడకంతో తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనేది మరిచిపోరాదు.
అదేపనిగా స్మార్ట్ ఫోన్లు వాడక, చూడటం వల్ల కళ్లపై తీవ్ర దుష్ర్పభావాన్ని చూపుతుంది. కళ్లు ఎండిపోయి పలు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. కళ్లు ఎండిపోతే రెటీనాపైనా ప్రభావం పడుతుంది.

మరీముఖ్యంగా చిన్నపిల్లలు స్మార్ట్ ఫోన్లలో గేమ్స్ ఆడుతూ ఉంటారు. అలాంటి వారి కళ్లు తీవ్రంగా ప్రభావితం అవుతాయి.
కళ్లల్లో నీరు ఇంకిపోవడం వల్ల కన్నీరు రాకపోవడం, అది కళ్లు ఎర్రగా మారి ఉబ్బిపోయి..చివరికి అదేపనిగా నలవడం జరుగుతుంది. ఇది స్మార్ట్ ఫోన్లను అదేపనిగా వాడకం వల్ల వచ్చు దుష్పరిణామం.ఇవి కేవలం కళ్లను డ్రైగా మార్చడమే కాదు..కంటి చూపుపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతుంది.

అదేపనిగా డిజిటల్  స్క్రీన్ లను వేటిని చూసినా అవి కళ్లపై ప్రభావం చూపుతాయి.అందుకే కంప్యూటర్, ల్యాప్ టాప్, మొబైల్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అదే పనిగా వాడకుండా…మరీ కళ్లకు దగ్గరగా వాడకుండా..చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అదే పనిగా వాడాల్సిన అవసరం ఉంటే మాత్రం మధ్యమధ్యలో కాస్త గ్యాప్ ఇవ్వాల్సిందేనని లేకపోతే కళ్లజోడు, ఆ తర్వాత కళ్లను ప్రమాదంలో పడేసినట్లేనని హెచ్చరిస్తున్నారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *