ఛీ..ఛీ..నీ గిఫ్టు త‌గ‌లెయ్య‌.. క్రిస్మ‌స్ ప‌రువు తీస్తావా..

Views: 370

ఒక‌ప్పుడు హీరో హీరోయిన్లైనా, సెల‌బ్రిటీలైనా…ప‌బ్లిసిటీ కోసం పేప‌ర్స్, టీవీ ఛాన‌ల్స్ ను ఆశ్ర‌యించేవారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుని వాళ్ల‌కిష్ట‌మొచ్చిన‌ట్టు ఆడుతున్నారు. ఏదిప‌డితే అది వాగుతున్నారు…ఏది ప‌డితే అది చూపిస్తున్నారు. కొంద‌రు సెక్స్ భామ‌లైతే మ‌రీ రెచ్చిపోతున్నారు. త‌మ మైలేజీ కోసం ఏ సంద‌ర్భాన్నైనా వాడుకుంటున్నారు. తాజాగా ఓ సెక్సీమ‌ణి క్రిస్మ‌స్ గిఫ్ట్ అంటూ యూ ట్యూబ్ లో అడ్డ‌మైన వీడియో పెట్టి…ప‌విత్ర‌మైన పండుగ ప‌రువు తీసింది.

పూన‌మ్ పాండే…ఏ మాత్రం మొహ‌మాటం లేకుండా స్కిన్ షో చేసే బ్యూటీ. త‌న అంద‌చందాల‌ను వీడియో తీయ‌డం త‌న‌కంటూ ఉన్న యూట్యూబ్ ఛాన‌ల్ లో దాన్ని పోస్ట్ చేయ‌డం…త ద్వారా క‌మ‌ర్షియ‌ల్ గానూ ల‌బ్దిపొంద‌డం..ఈ తంతు ఎంతో కాలంగా సాగుతోంది. గ‌తేడాది క్రిస్మ‌స్ పండుగ సంద‌ర్బంగా జింగిల్ బెల్స్ అంటూ ఓ వీడియోను యూ ట్యూబ్ లో పెట్ట‌గా 1.5 మిలియ‌న్ వ్యూస్ వ‌చ్చాయి. ఈసారి అంత‌కు మించి అన్న చందంగా జింగిల్ బెల్స్ పేరు మార్చి….జింగిల్ బూబ్స్ క‌మింగ్ సూన్ అంటూ అర్ధ‌న‌గ్న వీడియోను పోస్ట్ చేసింది.

టైటిల్ లోనే జింగిల్ బూబ్స్ అని ఉందంటే…ఈ అమ్మ‌డు వీడియోలో ఏం చూపించ‌ద‌లుచుకుందో అభిమానుల‌కు అర్థ‌మ‌య్యే ఉంటుంది. ఐతే క్రిస్మ‌స్ కోసం పూనమ్ పాండే స్పెష‌ల్ గిఫ్ట్ అంటూ చూపించ‌డ‌మేంట‌ని, క్రైస్త‌వులు అభ్యంత‌రం చెబుతున్నారు. పూన‌మ్ పాండే క్రిస్మ‌స్ పండుగ ప‌రువు తీస్తోందంటూ మండిప‌డుతున్నారు. ఐతే ఈ భామ మాత్రం త‌న వీడియోకు గ‌తేడాది కంటే ఎక్కువ వ్యూస్ వ‌స్తాయ‌ని గంపెడాశ‌తో ఎదురుచూస్తోంది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *