ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌లో చిరు భ‌లే న‌టించాడు..నిజంగా సూప‌ర్ యాక్టింగ్‌

Views: 10647

మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే కామెడీగానే ఉంటుంది. వెండితెర‌పై, చిరుకున్న గ్రేస్‌, డ్యాన్స్‌లో ఉండే బీట్ మ‌రె హీరోకు ఉండ‌ద‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌వ‌స‌రం లేదు. అలాంటి హీరో త్వ‌ర‌లో ఖైదీ నెంబ‌ర్ 150గా ఫ్యాన్స్ ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఇలాంటి టైమ్‌లో ఆయ‌న ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌తో ఫ్యాన్స్‌పై అపార‌మైన ప్రేమ‌ను, వెండితెర‌పై త‌న‌కున్న మోజును తెలియ‌జేశాడు. అయితే, ఆ చిరున‌వ్వుల్లో ఆయ‌న ఇచ్చిన కొన్ని హ‌వాభావాలు హాట్ హాట్‌గా మారాయి.

చిరంజీవి స్పీచ్ అటు ఇటుగా 33నిమిషాల పాటు కొన‌సాగింది. ఆయ‌న మాట్లాడుతున్నంత సేపు ఫ్యాన్స్ కేరింత‌లు కొట్టారు. అయితే, ఆయ‌న ఎదురుగా ఉన్న ఓ ప‌వ‌న్ క‌ళ్యాన్ అభిమాని, జ‌న‌సేన జెండా చూపిస్తూ చిరును ఇబ్బంది పెట్టాడు. ప‌వ‌న్ నినాదాల‌తో హోరెత్తించాడు. దీనిపై చిరు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశాడు. రెండు సంద‌ర్భాల్లో మాట్లాడ‌టం మానేశాడు. స‌ద‌రు అభిమానిని సెలైంట్‌గా ఉండ‌మ‌ని సైగ చేశాడు. అయినా, ప‌వ‌న్ ఫ్యాన్ అదే తీరును కొన‌సాగించ‌డంతో చిరు అస‌హ‌నంలోనే చిరున‌వ్వులు పూయించాడు.

కెమోరా ముందు యాక్ట్ చేయ‌డం చిరుకు కొత్తేం కాదు. అందుకే, త‌న‌కు కోపం వ‌స్తున్నా, ప‌వ‌న్ ఫ్యాన్ ఇబ్బంది పెడుతున్నా మొహంలో వేరియేష‌న్స్ మార్చుతూ చిరు అద్భుతంగా న‌టించాడు. ఇక్క‌డ యాక్ష‌న్‌, రెడీ, క‌ట్ లేకుండానే చిరు అద‌ర‌గొట్టాడు. కోపం వ‌స్తున్నా స‌రే చిరున‌వ్వును వ‌ద‌ల‌కుండా చిరు మెయింటెన్ చేయ‌డం ప్ర‌తి ఒక్క‌రిలో డిబేట్ పెట్టుకునేలా చేసింది. అంతేకాదు..ఫ్యాన్స్‌లో ఉత్తేజం నింప‌డం కోసం ఆయ‌న మాట్లాడిన తీరు ఆక‌ట్టుకుంది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *