చిరంజీవిని చూడకుండా..వాటి గురించి డిస్క‌ష‌న్ ఏంటి బాబు?

Views: 3506

క‌ర‌వ‌మంటే క‌ప్ప‌కు కోపం..విడ‌వ‌మంటే పాముకు కోపం. ఈ డైలాగ్ ఇప్పుడు ప‌ర్‌ఫెక్ట్‌గా ప్ర‌జెంట్‌ సిచ్యువేష‌న్‌కు సూట్ అవుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత చిరంజీవి వెండితెర‌పైన సంద‌డి చేస్తుంటే, డ్యాన్స్‌ల‌తో అద‌ర‌గొడుతుంటే, 61యేళ్ల వ‌య‌సులోనూ మున‌ప‌టి గ్రేస్‌, జోష్ చూపిస్తుంటే, అదంతా వ‌దిలేసి, మిగిలిన సినిమాలతో పొలుస్తూ కొంత‌మంది అభిమానులు చేస్తున్న హంగామా ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

మూవీ బెనిఫిట్ షో ప‌డ్డ కొద్దిసేప‌టికే దిల్‌రాజ్ లాంటి ప్రొడ్యూస‌ర్ హాల్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి, రికార్డ్‌ల‌న్నీ తిర‌గ‌రాస్తుంద‌న్నాడు. ఇప్పుడు ఓవ‌ర్‌సీస్ డిస్ట్రిబ్యూట‌ర్‌తో మాట్లాడాను అక్క‌డ వ‌సూళ్ల‌లో స‌రికొత్త రికార్డ్‌లు సృష్టిస్తుంద‌న్నాడు. ఆ కాసేప‌టికే, కొన్ని వెబ్‌సైట్లు, పేరుమోసిన పేప‌ర్ వాళ్లు, బాహుబ‌లిని క్రాస్ చేసింద‌న్నారు. సాయిధ‌ర‌మ్‌తేజ్ లాంటి హీరో బాహుబ‌లితో పొలుస్తూ ఖైదీని ఆకాశానికెత్తాడు. అల్లు అర్జున్ కూడా అమ్మ‌డు లేట్స్ డు రికార్డ్స్ కుమ్ముడు అని ట్వీట్ చేశాడు.

చిరంజీవి ప‌దేళ్ల క్రితం సాధించిన రికార్డ్‌లు ఇప్పుడు వేరే వారి పేరు మీద‌కు వెళ్లాయి. కాలం మారింది. రూపాయి రేటు పెరిగింది. వాటికి తోడు, మూవీలు రిలీజ్ అవుతున్న థియేట‌ర్ల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. అలాంట‌ప్పుడు రికార్డ్‌ల గురించి తొలి షో నుండే మాట్లాడుకోవ‌డం హాస్యాస్ప‌దం. పైగా..శాత‌క‌ర్ణి, శ‌త‌మానం భ‌వ‌తి రిలీజ్ అయ్యాకా, కంప్లీట్‌గా రెవెన్యూ ప‌డిపోవ‌డం గ్యారెంటీ. అలాంటిప్పుడు లాంగ్ ర‌న్ కోరుకోవ‌డంతో పాటు, చిరంజీవి రీ ఎంట్రీ గురించి ఎక్కువ‌గా ఫోక‌స్ చేయ‌డం బెట‌ర‌నేది చాలా మంది అభిప్రాయం. ఎందుకంటే, ఈ వ‌య‌సులో ఈ స్థాయిలో రీ ఎంట్రీ ఇచ్చిన స్టార్ మెగాస్టార్ త‌ప్ప ఎవ‌రూ లేర‌నేది చాలామంది అభిప్రాయం.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *