బ్లడ్ చెక్ చేసుకోండి…ఎంత కాలం బతుకుతారో తెలిసిపోతుంది!

Views: 239

నమ్మండి. నమ్మకపోండి..మీ రక్త పరీక్షే మీ జీవితకాలాన్ని అంటే మీరెంత కాలం బతుకుతారో చెబుతుంది. బోస్టన్ యూనివర్సిటీ రక్త పరీక్షలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది.రక్త పరీక్షల వల్ల వయసు, రోగాలు బయటపడ్తాయని ఏజింగ్ సెల్ అనే జర్నల్ లో బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు.

పరిశోధన‌లో 26 వివిధ రకాలైన బయోమార్కర్ సిగ్నేచర్స్ బయటపడ్డాయి. దీనివల్ల ముందే తమకు సంభవించే రోగాలు…పసిగట్టి జాగ్రత్తపడటంతో పాటు వయసును కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ‘ప్రజల వయసు, ఆరోగ్య సమస్యలు..శరీర మార్పులు..గుండె పోటు, కేన్సర్ వంటి ప్రమాదాలను పసిగట్టి జాగ్రత పడొచ్చు’ అని ప్రొఫెసర్ పౌలో సెబాస్టియన్, డాక్టర్ థామస్ పెర్ల్స్ చెప్పారు.

రక్త పరీక్షల వల్ల ఇంకా ఏలాంటి ప్రయోజనాలు సమకూతురాయి..ఎలాంటి జీవన ప్రమాణం పెంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే అంశాలపై పరిశోధనలు సాగుతున్నట్లు వారు తెలిపారు.బ్లడ్ టెస్టింగ్ వల్ల ఏజ్, డిసీజ్ చెప్పే విధానం త్వరలో అందుబాటులోకి రానున్నట్లు వారు చెప్పారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *