స్టూడెంట్‌తో టీచర్ రోమాన్స్, FBలో ఫొటోలు

Views: 911

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచర్….తన స్టూడెంట్‌కే ప్రేమ పాఠాలు చెప్పింది. ప్రేమపాఠాలు స్టార్ట్ అయితే కథ అంతటితో ఆగిపోతుందా? హోమ్ వర్కులు ఉంటాయి కదా. స్కూలు అయిపోయి..చీకటి పడ్డాక స్టూడెంట్ లవర్‌ను ఇంటికి పిలిపించుకుందో టీచర్… ఇద్దరు మద్యం మత్తులో చిత్తయిపోయారు. ఆ మత్తుల్లో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా…అందులో ఒకటి సోషల్ మీడియాలో అప్ లోడ్ కూడా చేశారు.

సోషల్ మీడియా అంటేనే రచ్చబండ…ప్రపంచమంతా పాకిన ఆ టీచర్-స్టూడెంట్ రోమాన్స్ పై కామెంట్లు చేశారు. అది కాస్త…ఆ లైకు ఈ లైకు దాటి..ఆ ప్రేమపావురాలు చదువుకుంటూ, పాఠాలు బోధిస్తున్న స్కూలుకు చేరాయి. ఆ ఫొటోలు చూసిన స్కూల్ యాజమాన్యం…పుస్తకాల్లోని పాఠాల కంటే వ్యక్తిగత ప్రేమ పాఠాలు బాగా చెబుతున్నావ్… ఇక దయచేయ్ అంటూ ఆమె మహిళా టీచర్ ను ఇంటికి సాగనంపారు.

ఈ సంఘటన స్కాట్లాండ్‌లోని జనరల్ టీచింగ్ కౌన్సిలింగ్ ఫర్ స్కాట్లాండ్ లో చోటు చేసుకుంది. ఇక్కడ టీచర్ గా పనిచేస్తున్న 27 ఏళ్ల ఇసబెల్లి గ్రహమ్…17ఏళ్ల విద్యార్థితో ఓ గదిలో  సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో పాఠశాల క్రమశిక్షణ కమిటీ గ్రహమ్ ను ఉద్యోగంలో నుంచి తొలగించింది.

అయితే గ్రహమ్ మాత్రం..ఫొటోలో ఉన్న సదరు విద్యార్థి కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి తనను మోసం చేశాడని, తానెలాంటి తప్పు చేయలేదని చెప్పింది. పాఠశాల తీసుకున్న తొలగింపు నిర్ణయాన్ని సవాల్ చేస్తానని చెప్పింది. అయితే సరైన తాను అమాయకురాలినంటూ సరైన ఆధాలు సమర్పించలేకపోవడంతో ఎడిన్ బర్గ్ కోర్టు ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించడం సరైన చర్యేనని సమర్థించింది.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *