వాటర్ ట్యాంకర్ డ్రైవర్…మిస్టర్ ఏషియా విన్నర్

Views: 272

కర్ణాటకలోని రామగొండన హల్లీకి చెందిన 25ఏళ్ల బాలకృష్ణ పిల్-ఏషియా (పిలీప్పీన్స్)-2016 బాడీబిల్డింగ్ విన్నర్ గా నిలిచాడు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన బాలకృష్ణతోపాటు తమ్ముడిని తల్లి కష్టపడి పెంచింది. ‘ఈ ఘనత సాధించడం పట్ల గర్వంగా ఫీలవుతున్నా. ఆర్థిక సహాకారం అందితే ప్రతియేడు నా సత్తా ఇలాగే చూపిస్తా. నాకు పునాదులుగా నిలిచి అన్నివేళలా అండగా నిలిచిన మా అమ్మ పార్వతమ్మ, తమ్ముడు రాజేష్‌లకు ఈ విజయం అంకితం’ అని బాలకృష్ణ అంటున్నాడు.

2013లో జర్ననీలో జరిగిన మిష్టర్ యూనివర్స్ మెడల్, 2014లో ఏథెన్స్ లో జరిగిన వరల్డ్ కేటగిరి ఛాంపియన్ షిప్ లో గెలుపొందాడీ  బాడీబిల్డర్. పంజాబ్ కు చెందిన బాడీ బిల్డర్ మనూష్ కుమార్, ముంబైకి చెందిన సంగ్రమ్ చౌగ్ల ల పర్యవేక్షణలో రోజుకు ఆరుగంటలు కష్టపడేవాడినని బాలకృష్ణ చెబుతున్నాడు. కోచ్ ల సహాకారం మరువలేనిదని అంటున్నాడు.

బాలకృష్ణ డైలీ డైట్ ఇది..

రోజు 750గ్రాముల చికెన్..25 గుడ్లు (ఉడకబెట్టినవి), 300గ్రాముల అన్నం, 200గ్రాముల కూరగాయలతో పాటు చేపలు, పండ్లు..120 కిలోల బరువుండే బాలకృష్ణ పిలీప్పీన్స్-ఏషియా బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు 90 కిలోలకు తగ్గాడు. దేశంలోని కొన్ని స్పోర్ట్స్, బాడీ బిల్డింగ్ అసోషియేషన్లు ఆర్థికంగా సాయం చేసేవి. 2010 నుంచి బాలకృష్ణ ఓ జిమ్ లో కోచ్ గా పనిచేస్తూనే…వాటర్ ట్యాంకర్ కు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.

అయితే ఇప్పటి వరకు బాలకృష్ణకు ప్రభుత్వం నుంచి ఏలాంటి ఆర్థిక సహకారం అందలేదు. ప్రభుత్వం ప్రొత్సహిస్తే దేశానికి మరిన్ని పతకాలు సాధించిపెడ్తానని బాలకృష్ణ దీమాతో చెబుతున్నాడు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *