మీ ఏడుపే మీ ఆరోగ్యం…

Views: 254

నవ్వు నలభై విధాల గ్రేట్. సకల సమస్యల నివారిణి కూడా. మరి ఏడుపు? ఏడుపు కూడా అంతకుమించి ఆరోగ్యమట. గట్టిగా నవ్వితే శరీరంలోని ప్రతి పార్ట్ యాక్టివ్ అయినట్టే.. ఏడిస్తే కూడా దాదాపుగా అదే రకమైన ఎక్సైర్ సైజ్ అవుతుందని ఓ సర్వే తేల్చింది. గట్టిగా ఏడిస్తే శరీరంలోని కలుషిత పదార్థాలన్నీ బయటకు పోతాయట. అంతేకాదు ఏడ్చిన వ్యక్తి చాలా రిలీఫ్ గా ఫీలవుతాడు. మనసునిండా ఏడ్చిన తర్వాత మనసు తేలికపడుతుందట.

కంటిలోని పొరలను క్లీన్ చేయడానికి, దుమ్మును నివారించేందుకు పోషకాల్ని అందించడానికి కన్నీళ్లు చేసే మేలు అంతా ఇంత కాదు. సమస్యల్ని తల్చుకుంటూ మనసులో బాధపడేకంటే ఏడిస్తేనే చాలా మేలంట. కన్నీళ్ల ద్వారా మాంగనీసు, పొటాషియం, ప్రోలాక్టిన్ బయటకు వెళ్తాయి. దీంతో మనసు కుదుటపడుతుంది. ఒత్తిడి దూరమవుతుంది. అంతేకాదు ఎమోషనల్, ఫిజికల్ బాధలు కూడా చాలా వరకు తగ్గుతాయని సర్వే తేల్చింది.

ఏడవడం వల్ల శరీరంలోని విషతుల్యమైన రసయనాలు బయటకు పోతాయి. ఓ వయసు వచ్చే వరకు అమ్మాయిలు అబ్బాయిలు సమానంగానే ఏడ్చినా.. వయసు పెరిగే కొద్ది అబ్బాయిల్లో ఏడ్చే గుణం బాగా తగ్గిపోతుందట. టెస్టోస్టెరాన్స్ కారణంగా ఏడ్చే గుణం అబ్బాయిల్లో తగ్గుతుందని సర్వే చెప్పిన మాట. అందుకే నవ్వడమే కాదు.. అప్పుడప్పుడు సమస్యను, బాధను దూరం చేసుకునేందుకు ఏడవడానికి ఏమాత్రం మొహమాటపడొద్దన్నది సర్వే చెబుతున్న నిజం.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *