చిర్రెత్తుకొచ్చి ఐఫోన్ షాపులో…

Views: 437

ఇష్టంగా కొనుక్కున్న వ‌స్తువు చేతికొచ్చిన రోజే స‌రిగా ప‌నిచేయ‌డం లేద‌నుకోండి…కోపం మాములుగా రాదు. ఇక‌, కొన్న షాపువాడిని ఉతికి ఆరేయ‌కుండా ఉండం. అలాంటిది లేటెస్ట్‌గా వ‌చ్చిన మెడ‌ల్‌, మ‌న ద‌గ్గ‌ర త‌ప్ప ఎవ‌రి ద‌గ్గ‌ర లేన‌ప్పుడూ, అంద‌రి క‌ళ్లు మ‌న‌మీదే ఉన్న‌ప్పుడు ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే, సిచ్యువేష‌న్ ఉహించ‌డానికే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సిచ్యువేష‌నే ఓ కుర్రాడికి క‌ల్గింది. ఇష్టంగా కొనుకున్న ఐ ఫోన్ ప‌నిచేయ‌కపోవ‌డంతో ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు.

చైనాకు చెందిన ఓ వ్య‌క్తి, త‌న ఐఫోన్‌ను తీసుకోని స‌ర్వీస్ సెంట‌ర్‌కి వెళ్లాడు. అక్క‌డ త‌న ఫోన్‌కున్న స‌మ‌స్య‌ను చెప్పాడు. అయితే, వారి నుంచి ఎటువంటి స్పంద‌న రాలేదు. పైగా, అత‌నితో కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. ఫోన్ రిపేర్ చేయ‌ను…కావాలంటే కొత్త‌ది కొనుక్కో అంటూ అవ‌హేళ‌న చేశాడు.  అంతే…వెంట‌నే కోపం న‌షాళానికి అంటిన అత‌ను, వెంట‌నే 6.2ల‌క్ష‌లు పెట్టి ప‌ది ఐఫోన్లు కొన్నాడు. ఆ వెంట‌నే, ఆ ఫోన్ల‌ను త‌న‌తో పాటే తెచ్చుకున్న సుత్తితో యజ‌మాని క‌ళ్ల‌ముందే ప‌గ‌ల‌గొట్టాడు. ఈ వ్య‌వ‌హ‌రంతో అంద‌రూ షాక్‌కు గుర‌య్యారు.

ఈ షాక్ నుండి తెరుకోక‌ముందే, ఆ షాపు య‌జ‌మాని మ‌రింత రెచ్చ‌గొట్టేలా మాట్లాడాడు. నీ ఫోన్లు ప‌గ‌ట‌గొడితే నీకే న‌ష్టం నాకు కాదు క‌దా అంటూ స‌మాధానం చెప్పాడు. దీనిపై మ‌రింత ఆవేశానికి లోనైన మ‌నోడు, వెంట‌నే 50ల‌క్ష‌ల రూపాయాలు చెల్లించి షాపూను పూర్తిగా ధ్వంసం చేశాడు. ఈ తీరుతో అంద‌రూ అవాక్క‌వ‌డం కాదు..వీడు పెద్ద పిచ్చొడురా బాబు, ఐఫోన్ పిచ్చొడు అంటూ ఆ షాపు నుండి ప‌రార‌య్యారు. ఏదీ ఏమైనా ఫోన్ రిపేర్ చెయించుకోవ‌డానికి వెళ్లి ఇలా 60ల‌క్ష‌లు అప్ప‌న్నంగా వృదా చేయ‌డం ఏంటో ఎర్రి కాక‌పొతే అని అంద‌రూ గుస‌గుస‌లాడుతున్నారు.

Comments: 0

Your email address will not be published. Required fields are marked with *